Telugu Global
Others

అటవీప్రాంతంలో మావోల డంప్‌ లభ్యం

తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని డొంకరాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల వారోత్సవాలు జరుపుకుంటున్నప్రాంతం నుంచి భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాకెట్‌ లాంఛర్‌, గ్రనైడ్‌ లాంచర్లు, 303 వెపన్‌, 4 రివాల్వర్లు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ఈనెల 28 నుంచి ఆగష్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసిన మూడు మండలాల్లో మావోలు పెద్దఎత్తున ఫ్లెక్సీసు, పోస్టర్లు […]

తూర్పు గోదావరి జిల్లా మన్యంలోని డొంకరాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల వారోత్సవాలు జరుపుకుంటున్నప్రాంతం నుంచి భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాకెట్‌ లాంఛర్‌, గ్రనైడ్‌ లాంచర్లు, 303 వెపన్‌, 4 రివాల్వర్లు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ఈనెల 28 నుంచి ఆగష్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసిన మూడు మండలాల్లో మావోలు పెద్దఎత్తున ఫ్లెక్సీసు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో డొంకరాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసి అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం కూంబింగ్‌ నిర్వహించగా ఈ భారీ డంపింగ్‌ లభ్యమైంది.
First Published:  28 July 2015 6:47 PM IST
Next Story