చిక్కుల్లో పోలీస్ శాఖ విభజన
రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినా పోలీస్ శాఖ విభజన మాత్రం పూర్తి కాలేదు. విభజనపై ఆంధ్రా పోలీస్ శాఖ చెబుతున్న లెక్కలకు, తెలంగాణ వద్ద ఉన్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. దీంతో రెండు రాష్ట్రాల పోలీస్ శాఖల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు చెందిన పోలీస్ ఉన్నతాధికారుల సంఖ్య ఎక్కువగా ఉండేది. విభజన తర్వాత వారు ఆంధ్రాకు వెళ్లడంతో పోలీస్ శాఖ విభజన గందరగోళంగా మారింది. పలు వాదోపవాదాల తరువాత […]
BY sarvi29 July 2015 6:58 AM IST
X
sarvi Updated On: 29 July 2015 6:58 AM IST
రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినా పోలీస్ శాఖ విభజన మాత్రం పూర్తి కాలేదు. విభజనపై ఆంధ్రా పోలీస్ శాఖ చెబుతున్న లెక్కలకు, తెలంగాణ వద్ద ఉన్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. దీంతో రెండు రాష్ట్రాల పోలీస్ శాఖల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాకు చెందిన పోలీస్ ఉన్నతాధికారుల సంఖ్య ఎక్కువగా ఉండేది. విభజన తర్వాత వారు ఆంధ్రాకు వెళ్లడంతో పోలీస్ శాఖ విభజన గందరగోళంగా మారింది. పలు వాదోపవాదాల తరువాత ఆంధ్రా లెక్కల ప్రకారం 516 డిఎస్పీలు, 124 అదనపు ఎస్పీలు, 23 మంది నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టులున్నాయి. అయితే, తెలంగాణ లెక్కల ప్రకారం 581 డిఎస్పీలు, 164 అదనపు ఎస్పీలు, 46 నాన్‌క్యాడర్ ఎస్పీ పోస్టులుండాలి. దీంతో మళ్లీ వివాదం మొదటికొచ్చింది. ఏపీ ఉన్నతాధికారులు కావాలనే కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీస్ శాఖ విభజన ప్రక్రియ ఫైలు ఆంధ్రా, తెలంగాణ డీజీపీ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది తప్ప కమలనాధన్ కమిటీ వద్దకు చేరడం లేదు.
Next Story