Telugu Global
Cinema & Entertainment

ఏడు గెటప్పుల్లో మహేష్

ఆగస్ట్ 7న విడుదలకాబోతున్న శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా 7 డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించి అలరించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేసిన అక్షయ్ త్యాగి చెప్పుకొచ్చాడు. కథ ప్రకారం మహేష్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాల్సి ఉంది. దీంతోపాటు దేవిశ్రీప్రసాద్ అందించిన కొన్ని ట్యూన్స్ ప్రకారం కూడా సరికొత్తగా కనిపించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే మహేష్ కోసం […]

ఏడు గెటప్పుల్లో మహేష్
X
ఆగస్ట్ 7న విడుదలకాబోతున్న శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా 7 డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించి అలరించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేసిన అక్షయ్ త్యాగి చెప్పుకొచ్చాడు. కథ ప్రకారం మహేష్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాల్సి ఉంది. దీంతోపాటు దేవిశ్రీప్రసాద్ అందించిన కొన్ని ట్యూన్స్ ప్రకారం కూడా సరికొత్తగా కనిపించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే మహేష్ కోసం ఏడు డిఫరెంట్ లుక్స్ తయారుచేశారట. ఇందులో బిజినెస్ మేన్ గా కనిపించే కార్పొరేట్ లుక్ నుంచి.. కాలేజ్ స్టూడెంట్ లుక్ వరకు చాలానే ఉన్నాయట. ఒక సీన్ లో అచ్చంగా ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపించి మెప్పించబోతున్నాడట మహేష్. ఇలా సినిమాలో మొత్తంగా 7 సరికొత్త గెటప్పుల్లో మహేశ్ కనిపించబోతున్నాడని సమాచారం. ఈ గెటస్స్ అన్నింటినీ కేవలం 6 వారాల్లోనే సాధించాడట మహేష్. దీంతో శ్రీమంతుడు సినిమాపై హైప్ మరింత పెరిగింది. దీనికి తోడు దేవిశ్రీ కంపోజ్ చేసిన పాటలు కూడా హిట్టవ్వడంతో, సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి.
First Published:  29 July 2015 12:31 AM IST
Next Story