ఎన్టీఅర్‌పై అయిష్టతను మరోసారి చాటుకున్న బాబు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాంజ్‌లో కొన్ని సంవత్సరాలుగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని ఎందుకు తొలగించారు? ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం అధికారవర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన సిబ్బంది చేత ఆ చిత్ర పటాన్ని తీసివేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరణించిన తొలి ముఖ్యమంత్రి కావడంతో అప్పటి స్పీకర్‌తో పాటు ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ చిత్ర పటాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అక్కడి […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాంజ్‌లో కొన్ని సంవత్సరాలుగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని ఎందుకు తొలగించారు? ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం అధికారవర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన సిబ్బంది చేత ఆ చిత్ర పటాన్ని తీసివేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరణించిన తొలి ముఖ్యమంత్రి కావడంతో అప్పటి స్పీకర్‌తో పాటు ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ చిత్ర పటాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అక్కడి నుంచి దానిని తొలగించడానికి కారణం ప్రభుత్వం మారిపోవడం, తెలుగుదేశం అధినేతకు ఇష్టం లేకపోవడం మాత్రమే కాదట. వివరాలలోకి వెళితే… అసెంబ్లీ జరిగే సమయంలో తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశాలు అక్కడే జరుగుతుంటాయి. ఎమ్మెల్యేలకు వైఎస్ చిత్ర పటం కనిపించకుండా ఆ సమయంలో ముసుగువేసేవారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని గమనించి కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారట. వైఎస్ చిత్రపటాన్ని అక్కడి నుంచి తొలగించాలి… లేదంటే ఎన్టీఆర్ చిత్ర పటాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయాలనేదే ఆ డిమాండ్. ఆయనతోపాటు చాలా మంది ఎమ్మెల్యేలు ఆ ప్రతిపాదన బాగుందని సమర్థించడంతో అందరూ దాని గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని లాంజ్‌లో ఏర్పాటు చేయించడం ఇష్టం లేని చంద్రబాబు వైఎస్ చిత్రపటాన్ని తీసివేయాల్సిందిగా ఆదేశించారని సమాచారం. అదీ కథ…