Telugu Global
Others

పెద్ద నాయకుడి చిన్న బుద్ధి!

ఎవరా పెద్ద నాయకుడు? ఏమిటా చిన్న బుద్ధి? అని చాలామందికి సందేహం రావచ్చు. ఎవరిపై శతృత్వం ఉన్నా సహజంగా ఎవరూ ఎదుటివారి చావును కోరుకోరు. అది మానవత్వం. ఒకవేళ ఎవరైనా ఎదుటివారి చావును కోరుకున్నారంటే అంతకన్నా హీనత్వం మరొకటి ఉండదు. రాజకీయాల్లో హత్యల మాట విన్నాం. కాని ఆ మాటలు రాజకీయ హత్యలు. అంటే రాజకీయంగా ఆ వ్యక్తిని లేకుండా చేయడం… కాని ఒక తెలుగుదేశం నాయకుడికి ఏమి అన్యాయం జరిగిందో… ఎంతమేరకు నష్టపోయాడో తెలీదు కాని… ఆయన […]

పెద్ద నాయకుడి చిన్న బుద్ధి!
X
ఎవరా పెద్ద నాయకుడు? ఏమిటా చిన్న బుద్ధి? అని చాలామందికి సందేహం రావచ్చు. ఎవరిపై శతృత్వం ఉన్నా సహజంగా ఎవరూ ఎదుటివారి చావును కోరుకోరు. అది మానవత్వం. ఒకవేళ ఎవరైనా ఎదుటివారి చావును కోరుకున్నారంటే అంతకన్నా హీనత్వం మరొకటి ఉండదు. రాజకీయాల్లో హత్యల మాట విన్నాం. కాని ఆ మాటలు రాజకీయ హత్యలు. అంటే రాజకీయంగా ఆ వ్యక్తిని లేకుండా చేయడం… కాని ఒక తెలుగుదేశం నాయకుడికి ఏమి అన్యాయం జరిగిందో… ఎంతమేరకు నష్టపోయాడో తెలీదు కాని… ఆయన జగన్‌ చావును కోరుకున్నాడు. కొంతమందికి ఓదార్పు ఇచ్చే పేరుతో ఆయన ఊరూరా తిరుగుతున్నాడు. ఆయన తిరగడాన్ని సహించలేక పోతున్నాడో లేక మరేదైనా కారణం ఉందోగాని కర్నూలుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించిన ఓ చిత్రమైన మాటను మాట్లాడాడు. జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ఉద్దేశిస్తూ ఈ వెంకటేశ్వర్లు… ఓదార్పు యాత్రలోనే జగన్ మోహన్ రెడ్డి ప్రాణాలు పోతాయని వ్యాఖ్యానించాడు. జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర నేపథ్యంలో ఈ తెలుగుదేశం నేత ఈ వ్యాఖ్యానం చేశాడు. ఇలాంటి యాత్రలో ఏమైనా జరగవచ్చని కూడా ఈయన హెచ్చరిక జారీ చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఈ వెంకటేశ్వర్లును పెద్ద నాయకుడు అని ఎందుకంటున్నామంటే ఆయన దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఎమ్మెల్యేగా చేశాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పదవులు వెలగబెట్టాడు. అలాంటి సీనియర్‌ నాయకుడు చాలా చిన్న బుద్ధితో జగన్‌ ప్రాణాల మీద వ్యాఖ్యానం చేయడం వింతగానే ఉంది. ఇలాంటి మాటలు ప్రజల్లోకి చెడు సంకేతాలను పంపుతాయి. ప్రతిపక్ష నేత విషయంలో ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం అధికార పక్షం విజ్ఞత ఏపాటిదో అర్ధం చేసుకోవడానికి పని చేస్తుంది.
First Published:  27 July 2015 6:36 PM IST
Next Story