లక్ష ఉద్యోగాలు15 వేలకు తగ్గడమా?: షబ్బీర్ అలీ
ఎన్నికల సందర్భంగా ఏడాదికి లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం… ఇప్పుడు 15 వేల ఉద్యోగాలకు దిగజారిందని కాంగ్రెస్ మండలి పక్ష నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఆయన గాంధీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయ్యాక లక్ష ఉద్యోగాలు కాస్తా 50 శాతానికి పడిపోయాయని, ఆ 50 వేల ఉద్యోగాలు జూలై నెలలో 25 వేలకు తగ్గాయన్నారు. తీరా 25 వేలలో 15 వేల ఉద్యోగాలనే ప్రకటించారని, జీవోలు వెలువడే నాటికి […]
BY sarvi27 July 2015 6:48 PM IST
sarvi Updated On: 28 July 2015 10:36 AM IST
ఎన్నికల సందర్భంగా ఏడాదికి లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం… ఇప్పుడు 15 వేల ఉద్యోగాలకు దిగజారిందని కాంగ్రెస్ మండలి పక్ష నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఆయన గాంధీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ సీఎం అయ్యాక లక్ష ఉద్యోగాలు కాస్తా 50 శాతానికి పడిపోయాయని, ఆ 50 వేల ఉద్యోగాలు జూలై నెలలో 25 వేలకు తగ్గాయన్నారు. తీరా 25 వేలలో 15 వేల ఉద్యోగాలనే ప్రకటించారని, జీవోలు వెలువడే నాటికి ఇంకెన్ని తగ్గుతాయోనని దెప్పి పొడిచారు. అయినా 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా మైనారిటీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారని, ఈ 15 వేల ఉద్యోగాల భర్తీలో 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, అవసరమైతే ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Next Story