Telugu Global
Others

ఐదోరోజూ లోక్‌సభలో అదే తంతు!

ప్ర‌తిప‌క్ష స‌భ్యుల నిర‌స‌నలు, నినాదాలతో లోక్‌స‌భ అట్టుడికి పోయింది. ఐపీఎల్ స్కాం ప్ర‌ధాన సూత్ర‌ధారి ల‌లిత్‌మోడీకి స‌హాయం చేసిన కేంద్ర‌మంత్రి సుష్మా, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రారాజేతోపాటు మ‌రో మంత్రి కూడా రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుప‌ట్టాయి. ప్ర‌తిప‌క్షాల డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం సానుకూలంగా లేక‌పోవ‌డంతో ఐదోరోజు కూడా పార్ల‌మెంటు స‌మావేశాలు స‌జావుగా సాగ‌లేదు. ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌లు, అధికార‌ప‌క్ష‌స‌భ్యుల ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో స‌భ అట్టుడికి పోయింది. కాంగ్రెస్ స‌భ్యులు చేతుల‌కు నల్ల‌బ్యాడ్జీ ధ‌రించి, ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న తెలిపారు. […]

ప్ర‌తిప‌క్ష స‌భ్యుల నిర‌స‌నలు, నినాదాలతో లోక్‌స‌భ అట్టుడికి పోయింది. ఐపీఎల్ స్కాం ప్ర‌ధాన సూత్ర‌ధారి ల‌లిత్‌మోడీకి స‌హాయం చేసిన కేంద్ర‌మంత్రి సుష్మా, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రారాజేతోపాటు మ‌రో మంత్రి కూడా రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుప‌ట్టాయి. ప్ర‌తిప‌క్షాల డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం సానుకూలంగా లేక‌పోవ‌డంతో ఐదోరోజు కూడా పార్ల‌మెంటు స‌మావేశాలు స‌జావుగా సాగ‌లేదు. ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌లు, అధికార‌ప‌క్ష‌స‌భ్యుల ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో స‌భ అట్టుడికి పోయింది. కాంగ్రెస్ స‌భ్యులు చేతుల‌కు నల్ల‌బ్యాడ్జీ ధ‌రించి, ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న తెలిపారు. కాంగ్రెస్‌తోపాటు ఇత‌ర పార్టీల ఎంపీలు కూడా ప్ర‌భుత్వంపై దాడి చేశారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ స‌భ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాల‌ను స్పీక‌ర్ తిర‌స్క‌రించారు. దీంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి నినాదాలు చేశారు. స‌భ‌ను నియంత్ర‌ణ చేసేందుకు స్పీక‌ర్ ప‌లుమార్లు స‌భ‌ను వాయిదా వేశారు. వాయిదా అనంత‌రం స‌మావేశ‌మైన త‌ర్వాత కూడా స‌భ అదుపులోకి రాక‌పోవ‌డంతో స్పీక‌ర్ స‌భ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. దీంతో పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల ఐదో రోజు స‌భాప‌ర్వం వాయిదాలతోనే గ‌డిచింది.
First Published:  27 July 2015 6:39 PM IST
Next Story