సమంత చిన్నప్పటి నుంచి అంతేనా ?
ప్రతి మనిషికి ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. కొందరు అది గుర్తిస్తారు. మరి కొందరు గుర్తించలేరు. సమంత మాత్రం తన లో వున్న ఒక బలమైన పాయింట్ ను గుర్తించిందట. తన కెరీర్ లో చాల షార్ట్ టైమ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను తెలుగులో అందుకుంది. అయితే ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ నుంచి టఫ్ కాంపిటేషన్ ఫేస్ చేస్తుంది. ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ నుంచి సమంతకు పోటీ ఉంది. మహేష్ […]
BY admin28 July 2015 3:30 PM IST
X
admin Updated On: 28 July 2015 11:50 AM IST
ప్రతి మనిషికి ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. కొందరు అది గుర్తిస్తారు. మరి కొందరు గుర్తించలేరు. సమంత మాత్రం తన లో వున్న ఒక బలమైన పాయింట్ ను గుర్తించిందట. తన కెరీర్ లో చాల షార్ట్ టైమ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను తెలుగులో అందుకుంది. అయితే ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ నుంచి టఫ్ కాంపిటేషన్ ఫేస్ చేస్తుంది. ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ నుంచి సమంతకు పోటీ ఉంది. మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం చిత్రం సరసన యాక్ట్ చాన్స్ కొట్టేసింది. గతంలో వీరిద్దరు దూకుడు, సీతమ వాకిట్లో సిరమల్లె చెట్టు చిత్రాలతో అలరించారు.
ఇంతకి సమంత లోవున్న ప్లస్ పాయింట్ ఏమిటో తెలుసా..? తనకు చిన్నప్పటి నుంచి మొండి పట్టు దల ఎక్కువట. అది సినిమా ఫీల్డ్ లో తనకు ఎంతో ప్లస్ అయ్యిందట. ఆ మనస్థత్వం ఉండటం వలనే కెరీర్ లో తనకు ఎదురైన సవాళ్లు విజయవంతంగా ఫేస్ చేసిందని తెలిపింది. ప్రస్తుతం తనకు ఎటువంటి చాలెంజెస్ లేవట కానీ.. ఆడియన్స్ ను తన శక్తి మేర ఆన్ స్క్రీన్ మీద మెప్పించడమే లక్ష్యమట. ఇంతకి సమంత అంతగా ఎదుర్కున్న సమస్యలు ఏమిటో తనకే తెలియాలి… ఎందుకంటే తను తెలుగులో ఇప్పటి వరకు చేసినవన్ని గ్లామర్ డాల్ రోల్సే కదా..! యాక్టింగ్ కోసం తను కష్టపడింది పెద్దగా ఏముంది ?
Next Story