Telugu Global
Others

న్యాయమూర్తులకు మీడియాలో పెద్దపీట

ఇటీవలి కాలంలో న్యాయమూర్తుల ఫొటోలు, వార్తలకు మీడియా ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తోంది. దినపత్రికల్లో అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, ఆర్థిక వార్తలు ఇచ్చినట్టే న్యాయమూర్తుల పుణ్యక్షేత్రాల సందర్శనకు కూడా ఒక కాలమ్‌ కేటాయించినట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా న్యాయమూర్తుల పుణ్యక్షేత్రాల సందర్శన ఫోటోలు, వార్తల్ని ముఖ్యంగా తిరుమల సందర్శన వార్తల్ని మనం పత్రికల్లో చూడాల్సి వస్తోంది. ఐదారేళ్ళక్రితం వరకు ఈ పరిస్థితి లేదు. యాదృచ్ఛికంగా జరిగిందో, కావాలని చేస్తున్నారోగాని జగన్‌ కేసుల విచారణ ప్రారంభం అయినప్పటి […]

న్యాయమూర్తులకు మీడియాలో పెద్దపీట
X

ఇటీవలి కాలంలో న్యాయమూర్తుల ఫొటోలు, వార్తలకు మీడియా ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తోంది. దినపత్రికల్లో అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, ఆర్థిక వార్తలు ఇచ్చినట్టే న్యాయమూర్తుల పుణ్యక్షేత్రాల సందర్శనకు కూడా ఒక కాలమ్‌ కేటాయించినట్లు కనిపిస్తోంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా న్యాయమూర్తుల పుణ్యక్షేత్రాల సందర్శన ఫోటోలు, వార్తల్ని ముఖ్యంగా తిరుమల సందర్శన వార్తల్ని మనం పత్రికల్లో చూడాల్సి వస్తోంది. ఐదారేళ్ళక్రితం వరకు ఈ పరిస్థితి లేదు.

యాదృచ్ఛికంగా జరిగిందో, కావాలని చేస్తున్నారోగాని జగన్‌ కేసుల విచారణ ప్రారంభం అయినప్పటి నుంచి రెండు, మూడు పత్రికల్లో ఇలాంటి వార్తలకు ప్రాధాన్యం ఎక్కువయింది. ఆ తరువాత కొద్ది రోజులకు సాక్షిలో కూడా ఇలాంటి వార్తలు ఎక్కువ అయ్యాయి. ఏ వార్తలు మిస్‌ అయినా ఫర్వాలేదు కానీ న్యాయమూర్తుల తిరుమల సందర్శన వార్తలు మిస్‌ అయితే ఉద్యోగం పోతుందని భయపడుతున్నారు తిరుమల విలేఖరులు.

మాయాబజార్‌ సినిమాలో కౌరవుల్ని దండించాలని వచ్చిన బలరాముడు కౌరవులు చేసిన అతిధి మర్యాదలకి పొంగిపోయి, వాళ్ళకు వరాలిచ్చేస్తాడు. అవసరమైన కొందరికి పుణ్యక్షేత్రాల్లో ఆ స్థాయిలో మర్యాదలు జరుగుతున్నాయని వార్త.

First Published:  28 July 2015 6:21 AM GMT
Next Story