వయసు 40.. పెళ్లికి రెడీ
హీరోయిన్ టబుకు ఇప్పుడు పెళ్లిపై మనసు మళ్లినట్టుంది. ఇన్నాళ్లూ సోలో లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ.. ఇప్పుడు పెళ్లిపై స్టేట్ మెంట్లు ఇస్తోంది. తగినవాడు దొరికితే పెళ్లికి రెడీ అంటోంది. సౌత్ లో సూపర్ హిట్టయిన దృశ్యం సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అజయ్ దేవగన్-శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన రీమేక్ లో టబు పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో టబు చేసింది. ఆ పాత్రకు బాలీవుడ్ లో […]
BY admin28 July 2015 12:39 AM IST
X
admin Updated On: 28 July 2015 6:06 AM IST
హీరోయిన్ టబుకు ఇప్పుడు పెళ్లిపై మనసు మళ్లినట్టుంది. ఇన్నాళ్లూ సోలో లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ.. ఇప్పుడు పెళ్లిపై స్టేట్ మెంట్లు ఇస్తోంది. తగినవాడు దొరికితే పెళ్లికి రెడీ అంటోంది. సౌత్ లో సూపర్ హిట్టయిన దృశ్యం సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అజయ్ దేవగన్-శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన రీమేక్ లో టబు పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో టబు చేసింది. ఆ పాత్రకు బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చింది టబు. అప్పుడే తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది. ఇన్నాళ్లూ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదని ప్రకటించిన టబు, ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవాలనే కోరికను బయటపెట్టింది. అయితే వ్యక్తిగతంగా తన విషయంలో మాత్రం పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా పెద్ద తేడాలేదని స్పష్టంచేసింది. అయితే తను పెళ్లి చేసుకుంటే చూడాలని తన కుటుంబసభ్యులు మాత్రం బలంగా కోరుకుంటున్నారని చెప్పుకొచ్చింది. వాళ్లకోసమైనా పెళ్లి చేసుకోవాలని ఉందని ముక్తాయింపు ఇచ్చింది టబు.
Next Story