Telugu Global
Others

కలాంకు పార్లమెంట్, కేబినెట్ నివాళి

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం హఠాన్మరణం పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించాయి. అనంతరం లోక్‌సభను గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. రాజ్యసభను మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. అబ్దుల్ కలాం అంత్యక్రియలు బుధవారం ఆయన స్వస్థలమైన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జరుగనున్నాయి. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కలాం కుటుంబసభ్యులు కోరిన విషయం […]

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం హఠాన్మరణం పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించాయి. అనంతరం లోక్‌సభను గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. రాజ్యసభను మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. అబ్దుల్ కలాం అంత్యక్రియలు బుధవారం ఆయన స్వస్థలమైన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జరుగనున్నాయి. ఈ మేరకు ప్రధాని అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కలాం కుటుంబసభ్యులు కోరిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ప్రభుత్వ అధికార నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో కలాం పార్థీవ దేహాన్ని ఉంచారు.
First Published:  27 July 2015 6:47 PM IST
Next Story