ఆంధ్ర టీడీపీ సారధిగా కళా వెంకటరావు?
ఏపీ టీడీపీకి అధ్యక్షుడిని వెతికే పనిలో ఉన్నారట అధినేత చంద్రబాబు. టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తాను కొనసాగుతూ తెలుగు రాష్ర్టాలకు అధ్యక్షులను నియమిస్తే ఎలాగుంటుందనే ఆలోచనలోఉన్నారట బాబు. రెండు రాష్ర్టాల వ్యవహారాలు చక్కబెట్టేది, వ్యూహాలు అమలు చేసేది చంద్రబాబేనన్నది టీడీపీ నేతలు ఎరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధ్యక్ష పదవి అంటే ఆరో వేలులాంటిదని సీనియర్ల సంభాషణల్లో బయటపడుతున్న వాస్తవం. ఓ వైపు మంత్రివర్గ విస్తరణ ఉంటుండగా తమనెక్కడ అధ్యక్ష పదవికి ప్రపోజ్ చేస్తారనే […]
BY sarvi28 July 2015 8:56 AM IST
X
sarvi Updated On: 28 July 2015 8:57 AM IST
ఏపీ టీడీపీకి అధ్యక్షుడిని వెతికే పనిలో ఉన్నారట అధినేత చంద్రబాబు. టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తాను కొనసాగుతూ తెలుగు రాష్ర్టాలకు అధ్యక్షులను నియమిస్తే ఎలాగుంటుందనే ఆలోచనలోఉన్నారట బాబు. రెండు రాష్ర్టాల వ్యవహారాలు చక్కబెట్టేది, వ్యూహాలు అమలు చేసేది చంద్రబాబేనన్నది టీడీపీ నేతలు ఎరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధ్యక్ష పదవి అంటే ఆరో వేలులాంటిదని సీనియర్ల సంభాషణల్లో బయటపడుతున్న వాస్తవం. ఓ వైపు మంత్రివర్గ విస్తరణ ఉంటుండగా తమనెక్కడ అధ్యక్ష పదవికి ప్రపోజ్ చేస్తారనే భయంతో సీనియర్ నేతలు గుబులుతో ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలకు ఈ టెన్షన్ మరీ ఎక్కువగా ఉందని టీడీపీ వర్గాల సమాచారం. ప్రస్తుత ఎచ్చెర్ల ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి కిమిడి కళావెంకటరావు..మంత్రివర్గ విస్తరణలోతనకు అవకాశం దక్కుతుందని ఎంతో ఆశతో ఉన్నారు. అయితే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళాను నియమిస్తే ఎలా ఉంటుందని బాబు తన సన్నిహితులతో చర్చిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన ఈ పదవి తనకెందుకునుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే కేబినెట్‌లో కళా వెంకటరావు తమ్ముడి భార్య మృణాళిని కొనసాగుతున్నారు. ఆమెను తప్పిస్తే తప్ప తనకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదన్నది కళా వెంకటరావుకు తెలుసు. ఇది జరగక ముందే తనను ఏపీ టీడీపీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేస్తారేమోననే ఆందోళన కళా వెంకటరావులో కనిపిస్తోంది. మరదలిని తప్పించి… మంత్రి పదవి తీసుకుంటే తమ్ముడితో తలనొప్పి… అధినేత మాటకు తలొగ్గి అధ్యక్ష స్థానంలో కూర్చుంటే డమ్మీ అయిపోతామనే భయంతో కళా వెంకటరావు కలవరపడుతున్నారు.
Next Story