క్రెడిట్ కొట్టేసిన జగన్!
మున్సిపల్ సమ్మె పరిష్కారం కావడం కార్మికుల్లో మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సంతోషాన్ని నింపింది. ప్రభుత్వం ఓ వైపు కార్మికుల డిమాండ్లను అంగీకరించడం మూలంగా ఖజానాపై కొత్తగా ఎంత భారం పడిందో లెక్కలేసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ పార్టీకి కొత్తగా ఎంత మైలేజీ వచ్చిందో అంచనాలు వేసుకుంటున్నారు. మునిసిపల్ సమ్మె పరిష్కారం కావడంతో కార్మిక జేఏసీ నేతలు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలసి […]
BY Pragnadhar Reddy27 July 2015 2:28 AM IST
X
Pragnadhar Reddy Updated On: 27 July 2015 2:29 AM IST
మున్సిపల్ సమ్మె పరిష్కారం కావడం కార్మికుల్లో మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సంతోషాన్ని నింపింది. ప్రభుత్వం ఓ వైపు కార్మికుల డిమాండ్లను అంగీకరించడం మూలంగా ఖజానాపై కొత్తగా ఎంత భారం పడిందో లెక్కలేసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ పార్టీకి కొత్తగా ఎంత మైలేజీ వచ్చిందో అంచనాలు వేసుకుంటున్నారు. మునిసిపల్ సమ్మె పరిష్కారం కావడంతో కార్మిక జేఏసీ నేతలు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలసి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో రైతు భరోసా యాత్రలో ఉన్న జగన్‌ను కలుసుకుని మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని జగన్ అల్టిమేటమ్ జారీ చేసిన తర్వాతే ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందని కార్మిక జేఏసీ నేతలు చెప్పారు. మునిసిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా తమ పక్షాన నిలబడి జగన్ అల్టిమేటమ్ జారీ చేయడంతోనే ప్రభుత్వం దిగివచ్చిందని జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. “గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నపుడు కూడా ప్రభుత్వం తొలుత స్పందించలేదు. జగన్ చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోనే దిగివచ్చింది… ఇపుడు మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలోనూ అంతే.. జగన్ చొరవ వల్లే సమస్యలు పరిష్కారమయ్యాయి.” అని కార్మిక జేఏసీ నేతలు పేర్కొన్నారు. “రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్మికులంతా మీ మేలును ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.” అని నేతలు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story