Telugu Global
Others

ఉగ్ర పంజా... ఎస్పీ దుర్మరణం... టెర్రరిస్టుల హతం!

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌ ముగిసింది. ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. 12 గంటలపాటు సాగిన ఉగ్రపోరులో మొత్తం 13 మంది మృతి చెందారు. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యతగా ప్రకటించుకోలేదు. భారీ ఆయుధాలతో ఉన్న ఓ ఉగ్రవాదిని ఉదయమే హతమార్చారు. మధ్యాహ్నం తర్వాత మిగతా ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాదులు హతమైన తర్వాత ఎదురుకాల్పుల ఆపరేషన్‌ నిలిపివేసినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అయితే కూంబింగ్‌ ఆపరేషన్‌ మాత్రం కొనసాగిస్తున్నారు. ఉగ్ర ఘటనతో దేశమంతా […]

ఉగ్ర పంజా... ఎస్పీ దుర్మరణం... టెర్రరిస్టుల హతం!
X
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌ ముగిసింది. ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. 12 గంటలపాటు సాగిన ఉగ్రపోరులో మొత్తం 13 మంది మృతి చెందారు. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యతగా ప్రకటించుకోలేదు. భారీ ఆయుధాలతో ఉన్న ఓ ఉగ్రవాదిని ఉదయమే హతమార్చారు. మధ్యాహ్నం తర్వాత మిగతా ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఉగ్రవాదులు హతమైన తర్వాత ఎదురుకాల్పుల ఆపరేషన్‌ నిలిపివేసినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అయితే కూంబింగ్‌ ఆపరేషన్‌ మాత్రం కొనసాగిస్తున్నారు. ఉగ్ర ఘటనతో దేశమంతా హై అలర్ట్‌ ప్రకటించారు. అన్ని రాష్ర్టాల్లోనూ భద్రతను పెంచారు ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్‌ మాత్రం ఈ దాడులను ఖండించింది. తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది.
ఉదయం నుంచీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు డిటెక్టివ్ విభాగం పని చేస్తున్న ఎస్పీ బల్జీత్‌ సింగ్‌ ప్రాణాలు తీశారు. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎస్పీ బల్జీత్‌సింగ్‌ ప్రాణాలకు తెగించి పోరాడి వీర మరణం పొందారు. ఈ సంఘటనలో 13 మంది చనిపోయారు. ఎన్‌.ఎస్‌జీ, బిఎస్‌ఎఫ్‌ దళాలతోపాటు పోలీసులు కూడా ఈ ఎదురుకాల్పుల సంఘటనలో పాల్టొన్నారు. చనిపోయిన 13 మందిలో ఒక ఎస్పీ, ముగ్గురు పోలీసులు, ఒక ఉగ్రవాది ఉన్నారు. అంతకుముందు సైనిక దుస్తుల్లో వచ్చిన నలుగురు టెర్రరిస్టులు గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్‌పై సోమవారం తెల్లవారుజామున విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు పౌరులు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. చోరీ చేసిన తెల్లమారుతీ కారులో మిలిటెంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు పౌరులు, ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు చాలాసేపు కొనసాగాయి. దాడిలో మొత్తం నలుగురు మిలిటెంట్లు పాల్గొన్నారు. ఉగ్రవాదులు మొదట ఓ బస్సుమీద కూడా కాల్పులు జరపగా బస్సులోని ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అటు-దీనానగర్, పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ పట్టాలపై అయిదు బాంబులను అమర్చినట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ రైల్వేట్రాక్‌పై ఐదు చోట్ల ఉన్న పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. మొదటవారు ఓ హోటల్ యజమానిని గాయపరచి అతని మారుతి కారులో దీనానగర్ పోలీస్ స్టేషన్ చేరుకొని అక్కడ బీభత్సం సృష్టించారు.
ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనపై పంజాబ్‌ సీఎం బాదల్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటనా స్థలికి ఆర్మీ, సైనిక దళాలను కేంద్రం తరలించింది. అటు పాకిస్థాన్‌ సరిహద్దుకు కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే దీనానగర్‌ ప్రాంతం ఉంది. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆయన బీఎస్‌ఎఫ్‌ అధికారులను ఆదేశించారు. మరిన్ని దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్‌ ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఘటనతో దేశ రాజధాని డిల్లీ సహా మెట్రో నగరాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. పంజాబ్‌లో దాడులు జరిగే ప్రమాదం ఉందని ముందుగానే ఇంటిలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించిన రెండుమూడు రోజుల్లోనే ఈ సంఘటన జరగడం గమనార్హం. ఐ.బి. హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని రాష్ర్టాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదుల సమస్య జాతీయమైనదని, టెర్రరిస్టుల దాడిన ఊహించలేదని ఆయన అన్నారు.
First Published:  27 July 2015 4:30 PM IST
Next Story