Telugu Global
Cinema & Entertainment

స‌మంత టార్గెట్ ఆ హీరోయినే ..!

ఏ మాయ చేశావే అంటూ  స‌మంత తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన‌ప్పుడు ..తను టాప్ హీరోయిన్ అవుతుందని అని ఎవ‌రు ఊహించ‌లేదు.    అమ్మ‌డి  క్యూట్ అండ్ హాట్ లుక్ కు తెలుగు అబ్బాయిలు ఫిదా అయ్యారు… ఆడియ‌న్స్  తో  పాటు..  మ‌న తెలుగు ఫిల్మ్ మేక‌ర్స్   కూడా ఫిదా అయ్యారు.  అంతే  దూకుడు  చిత్రంతో   స్టార్ హీరోయిన్  అయ్యింది. అక్క‌డ నుంచి  స‌మంత  స్టార్ డ‌మ్   జ‌ట్ స్పీడ్ లో వెళ్లింది. […]

స‌మంత టార్గెట్ ఆ హీరోయినే ..!
X
ఏ మాయ చేశావే అంటూ స‌మంత తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన‌ప్పుడు ..తను టాప్ హీరోయిన్ అవుతుందని అని ఎవ‌రు ఊహించ‌లేదు. అమ్మ‌డి క్యూట్ అండ్ హాట్ లుక్ కు తెలుగు అబ్బాయిలు ఫిదా అయ్యారు… ఆడియ‌న్స్ తో పాటు.. మ‌న తెలుగు ఫిల్మ్ మేక‌ర్స్ కూడా ఫిదా అయ్యారు. అంతే దూకుడు చిత్రంతో స్టార్ హీరోయిన్ అయ్యింది. అక్క‌డ నుంచి స‌మంత స్టార్ డ‌మ్ జ‌ట్ స్పీడ్ లో వెళ్లింది. అయితే ఏదైన పెరుగుడు విరుగుడు కొర‌కే అన్న‌ట్లు.. ప‌డిపోయింది. గ‌త యేడాది తెలుగులో చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌టంతో స‌మంత‌కు టాలీవుడ్ లో బ్యాడ్ టైమ్ ప్రారంభం అయ్యింది.
ఇక తాజాగా స‌మంత ప్లేస్ ను ర‌కుల్ ప్రీతిసింగ్ ఆల్మోస్ట్ కబ్జా చేసేసింది. ఇక ర‌కుల్ ప్రీతి సింగ్ జోరుకు స‌మంత కోలుకోవ‌డం కష్టమే అనుకున్నారు. కానీ.. స‌మంత తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’లో ఓకే అయిన ఈమె, తాజాగా త్రివిక్రమ్ న్యూఫిల్మ్‌లో ఛాన్స్ కొట్టేసిందట. అదేనండి నితిన్- త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలని ఆలోచించి చివరకు మాటల మాంత్రికుడు చెన్నై బ్యూటీ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఫోన్ చేయగానే సమంత వెంటనే ఓకే చెప్పేసిందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ లెక్కన సమంత కాస్త గ్లామర్ డోస్ పెంచి, మెల్లగా రకుల్ ప్రీత్‌సింగ్‌ని టార్గెట్ చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి.
First Published:  27 July 2015 7:12 AM IST
Next Story