పరకాలపైనే తొలి వేటు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌పై వేటు పడబోతోందా..? ఆయను ఆ పదవి నుంచి తప్పించబోతున్నారా…? జరుగుతున్న పరిణామాలు పరకాలపై వేటు తప్పదనే సంకేతాలనిస్తున్నాయి. పరకాల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆది నుంచీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి కొన్ని పరిణామాలు ఆ అసంతృప్తిని మరో మెట్టు ముందుకు తీసుకుపోయాయి. ఓటుకు నోటు దగ్గర నుంచి గోదావరి పుష్కరాల వరకు ముఖ్యమైన ప్రతి సందర్భంలోనూ పరకాల వ్యవహరించిన తీరు పట్ల చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనయ్యారు. […]
BY Pragnadhar Reddy26 July 2015 7:58 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 26 July 2015 10:46 PM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌పై వేటు పడబోతోందా..? ఆయను ఆ పదవి నుంచి తప్పించబోతున్నారా…? జరుగుతున్న పరిణామాలు పరకాలపై వేటు తప్పదనే సంకేతాలనిస్తున్నాయి. పరకాల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆది నుంచీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి కొన్ని పరిణామాలు ఆ అసంతృప్తిని మరో మెట్టు ముందుకు తీసుకుపోయాయి. ఓటుకు నోటు దగ్గర నుంచి గోదావరి పుష్కరాల వరకు ముఖ్యమైన ప్రతి సందర్భంలోనూ పరకాల వ్యవహరించిన తీరు పట్ల చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది అయినందున కేబినెట్‌లో, సిఎం కార్యాలయం (సిఎంవొ)లో, ప్రత్యేకించి తన అనుచర బృందంలో సమూల మార్పులు చేయాలని చంద్రబాబు భావించారు. అయితే ఓటుకు నోటు వివాదం తలెత్తడం, జపాన్ పర్యటన, గోదావరి పుష్కరాలు వెంట వెంటనే రావడంతో ప్రక్షాళన వాయిదా పడింది. పుష్కరాలు పూర్తయినందున ఇక మార్పులపై దృష్టి సారిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్షాళన అంటూ మొదలు పెడితే తన సన్నిహిత టీమ్‌లోని పరకాల ప్రభాకర్‌పైనే తొలి వేటు పడొచ్చని అంటున్నారు. అందుకు పలు కారణాలను పేర్కొంటున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో లోపాలు పరకాలపై ముఖ్యమంత్రి విముఖతను మరింత పెంచాయని అంటున్నారు. పుష్కరాల ఏర్పాట్లపై నియమించిన కమిటీకి పరకాల ఛైర్మన్. ఏర్పాట్ల విషయంలో ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టలేదని సిఎం అసంతృప్తిగా ఉన్నారు. అసలు సమీక్షలు చేయలేదని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించడంలో విఫలమ య్యారని అసహనంతో ఉన్నారు. పరకాల సరిగ్గా పని చేయనందున అన్నీ తానే చూసుకోవాల్సి వచ్చిందని రాజమండ్రిలో ఇటీవల జరిగిన కేబినెట్‌లో పరకాల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇవే కాదు.. అంతకు ముందు ఓటుకు నోటు వ్యవహారంలో స్పందించిన తీరు, మంగళగిరి సంకల్ప సభలో ప్రదర్శించాల్సిన సీడీ మర్చిపోవడం వంటివి కూడా పరకాలపై చంద్రబాబు అసంతృప్తిని పెంచాయి. అయితే పరకాలను తొలగించడానికి ఒకే విషయంలో చంద్రబాబు తటపటాయిస్తున్నాడు. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ తో భవిష్యత్తు అవసరాల మీద ఆధారపడి పరకాలతో సర్దుకపోతున్నాడు. వెంకయ్యనాయుడు ఉండగా ఇక నిర్మలా సీతారామన్ తో పనేంటి అనుకుంటే పరకాల ప్రభాకర్ పై వేటు పడవచ్చు….
Next Story