ఇండియా-పాక్ సీరీస్ రద్దు!
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో సోమవారం జరిగిన ఉగ్రవాద ఘటన ఇండియా-పాకిస్తాన్ సీరిస్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ఇలాంటి దాడులకు పాల్పడితే పాక్‌తో ఎలాంటి సీరిస్‌లు ఆడేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ తో ఎలాంటి సీరిస్‌లు ఆడబోమని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ శర్మ సోమవారం ప్రకటన చేశారు. అనురాగ్ శర్మ ప్రకటనతో పాక్ క్రికెట్ బోర్డుపై పిడుగు పడ్డంత పనైంది. ముంబైదాడుల తర్వాత భారత్ పాక్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోలేదు. ఇరుజట్లు తటస్థ […]
BY Pragnadhar Reddy27 July 2015 5:22 PM IST
X
Pragnadhar Reddy Updated On: 28 July 2015 6:05 AM IST
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో సోమవారం జరిగిన ఉగ్రవాద ఘటన ఇండియా-పాకిస్తాన్ సీరిస్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ఇలాంటి దాడులకు పాల్పడితే పాక్‌తో ఎలాంటి సీరిస్‌లు ఆడేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ తో ఎలాంటి సీరిస్‌లు ఆడబోమని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ శర్మ సోమవారం ప్రకటన చేశారు. అనురాగ్ శర్మ ప్రకటనతో పాక్ క్రికెట్ బోర్డుపై పిడుగు పడ్డంత పనైంది. ముంబైదాడుల తర్వాత భారత్ పాక్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోలేదు. ఇరుజట్లు తటస్థ వేదికలపై మాత్రం అప్పుడప్పుడు తలపడుతున్నాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో పాక్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) బీసీసీఐతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇందుకు బీసీసీఐ కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఉభయదేశాల మధ్య సీరిస్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు 9 మందిని పొట్టనబెట్టుకున్నారు. దీంతో పాక్‌తో ఎలాంటి సీరిస్‌లు ఆడేదిలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో పీసీబీలో మిణుకుమిణుకుమంటున్న ఆశలు కాస్త ఆవిరయ్యాయి.
2009లో శ్రీలంక జట్టుపై ఉగ్ర దాడి..!
2008 ముంబై దాడుల తరువాత బీసీసీఐ పాక్‌తో ఎలాంటి సీరిస్‌లు ఆడలేదు. దీని ప్రభావం ఆ బోర్డు ఆదాయంపై పడింది. మూలిగే నక్కమీద తాటిపండు చందంగా 2009లో పాక్‌లో క్రికెట్ సీరిస్ ఆడేందుకు వెళ్లిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఆటగాళ్లు ఎవరూ చనిపోలేదు. కానీ, స్వల్పగాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి ఏ దేశమైనా పాక్ పేరు చెబితే వామ్మో! అని పారిపోతున్నారు. అది ఉగ్రవాద దేశమని అక్కడ క్రికెట్ ఆడితే తిరిగి రాలేమని ముఖాన చెప్పేస్తున్నారు.
Next Story