ఢిల్లీ పోలీసులు కేంద్ర పరిధిలోనే ఉండాలి
శాంతిభద్రతల అంశం ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర పరిధి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేస్తున్న డిమాండు సహేతుకం కాదని పోలీసు ఉన్నతాధికారి బాసిస్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పౌరుడుగా ఈ అంశంపై మాట్లాడే స్వేచ్ఛ తనకుందని ఆయన అన్నారు. ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కన్నా దురదృష్టకరమైన అంశం మరొకటి ఉండదని, ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు శాఖపై పెత్తనం ప్రధాని, […]
BY sarvi27 July 2015 9:28 AM IST
X
sarvi Updated On: 27 July 2015 9:28 AM IST
శాంతిభద్రతల అంశం ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర పరిధి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేస్తున్న డిమాండు సహేతుకం కాదని పోలీసు ఉన్నతాధికారి బాసిస్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పౌరుడుగా ఈ అంశంపై మాట్లాడే స్వేచ్ఛ తనకుందని ఆయన అన్నారు. ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కన్నా దురదృష్టకరమైన అంశం మరొకటి ఉండదని, ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు శాఖపై పెత్తనం ప్రధాని, హోంమంత్రుల వద్ద ఉండడం వల్ల ఒత్తిళ్లు ఉండవని ఆయన చెప్పారు.
Next Story