కార్మిక హక్కులపై కేంద్రం ముప్పేట దాడి
కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న హక్కులపై కేంద్రం దాడి తీవ్రం చేసినందునే దేశంలోని 13 కేంద్ర కార్మిక సంఘాలు ఒక్కతాటి పైకి వచ్చాయని నేతలు అన్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 2న కార్మికులు చేపట్టిన సమ్మె సన్నాహక సదస్సు ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సదస్సులో పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సభలో పాల్గొన్న సిఐటియు అఖిలభారత […]
BY sarvi26 July 2015 6:35 PM IST
sarvi Updated On: 27 July 2015 5:51 AM IST
కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న హక్కులపై కేంద్రం దాడి తీవ్రం చేసినందునే దేశంలోని 13 కేంద్ర కార్మిక సంఘాలు ఒక్కతాటి పైకి వచ్చాయని నేతలు అన్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 2న కార్మికులు చేపట్టిన సమ్మె సన్నాహక సదస్సు ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సదస్సులో పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సభలో పాల్గొన్న సిఐటియు అఖిలభారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మాట్లాడుతూ దేశం ఆర్ధికంగా బలం పుంజుకుంటోందని, అయితే కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను కాలరాచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ దాడిని తిప్పికొట్టేందుకు కార్మిక సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story