Telugu Global
Others

మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్‌ కలాం కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, మానవతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఏపీజె అబ్దుల్‌ కలాం కన్ను మూశారు. ఈసాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భారత 11వ రాష్ట్రపతిగా ఆయన సేవలందించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆయన మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాంగణంలో లివబుల్‌ ప్లానెట్‌ ఆన్‌ ఎర్త్‌ అనే అంశంపై ఆయన […]

మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్‌ కలాం కన్నుమూత
X

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, మానవతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఏపీజె అబ్దుల్‌ కలాం కన్ను మూశారు. ఈసాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భారత 11వ రాష్ట్రపతిగా ఆయన సేవలందించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆయన మేఘాలయా రాజధాని షిల్లాంగ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాంగణంలో లివబుల్‌ ప్లానెట్‌ ఆన్‌ ఎర్త్‌ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని బెథాని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని పీటీఐ వార్తసంస్థ కథనం. ఆయన అసలు పేరు అవుల్‌ పకీర్‌ జైనులబ్దీన్‌ కలాం. ఆయనకు 83 సంవత్సరాలు. ఆయన 1931న అక్టోబర్‌ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. షిల్లాంగ్‌ వెళుతున్నా అంటూ ఆయన చివరిసారిగా ట్వీట్‌ చేశారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆయన అవివాహితుడు.

ఈ మిస్సైల్‌ మేన్‌ 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రపతి కాక ముందు ఆయన అంతరిక్ష పరిశోధన సంస్థలో అనేక కీలక పదవులు నిర్వహించారు. 40 యేళ్లపాటు ఆయన రక్షణ రంగంలో కీలక పదవులు నిర్వహించారు. దేశానికి పరిశోధనలే ప్రాణం అని నమ్మిన విధాత. ఆయన సారధ్యంలో అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా గగన తలానికి చేరాయి. రాజస్థాన్‌లోని 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్షల్లో కలాం కీలక భూమిక పోషించారు. పేపర్‌ బాయ్‌ నుంచి రాష్ట్రపతి వరకు ఆయన ప్రస్థానం సాగింది. 1981లో పద్మభూషన్‌, 1990లో పద్మ విభూషన్‌, 1997లో భారతరత్న అవార్డు అందుకున్నారు. అబ్దుల్‌ కలాంకు 40 యూనివర్శిటీల నుంచి డాక్టరేట్లు లభించాయంటే ఆయన ఎంతటి మహనీయుడో అర్ధం చేసుకోవచ్చు. విలువలకు వన్నె తెచ్చిన అబ్దుల్‌ కలాం అందరికీ ఆదర్శప్రాయుడని వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ అనే పుస్తకాన్ని అనువదించిన వాడ్రేవు చిన వీరభద్రుడు అన్నారు. వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ పుస్తకాన్ని తన జీవిత గమనం ఆధారంగా అబ్దుల్‌ కలాం స్వయంగా రచించారు. ఇది లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. నిజమైన మంచితనం, వ్యక్తిత్వం, విలువలకు కలాం నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. కలలు కనండి… వాటిని సాకారం చేసుకోండి అన్న నినాదంతో యువతను, పిల్లల్ని ఉత్తేజ భరితుల్ని చేసిన ఘనత కలాంకే దక్కుతుంది. భారత సైన్యం కోసం ఆయన చిన్న హెలికాప్టర్‌ తయారు చేయడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. డిఆర్‌డీఓలో పని చేయడంలో సంతృప్తి చెందని ఆయన ఇస్రోలో చేరారు. బాలిస్టిక్‌ క్షిపణి, ఉపగ్రహ వాహక నౌక ప్రయోగ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఘనత కలాంకే దక్కింది.

అబ్దుల్‌ కలాం మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర సంతాపం ప్రకటించారు. టెక్నాలజీ నుంచి, రామాయణం నుంచి, మహా భారతం, భాగవతం నుంచి అనేక ఉదాహరణలతో తనను ఎన్నో విధాలుగా ప్రభావితం చేశారని, తనకూ, ఆయనకు ఎంతో అనుబంధం ఉందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ చెప్పారు. తనకు ఒక్కోసారి ఒక్కో ఐడియా ఇస్తూ ఎన్నో రకాలుగా స్ఫూర్తి ఇచ్చారని ఆయన అన్నారు. తనకు ఆయన గురుతుల్యుడని గవర్నర్‌ అన్నారు. చదువు పట్ల, పిల్లలకు విజ్ఞానం పట్ల ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా వ్యవహరించేవారని గవర్నర్‌ అన్నారు. ఆయనకు సంతాపం తెలపడం చాలా చిన్న విషయమని, అందరూ గుర్తు పెట్టుకుని కలాం ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని గవర్నర్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, వైసీపీ అధ్యక్షడు జగన్‌, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజన చౌదరి, అశోక్‌ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. సోమవారం అర్దరాత్రి షిల్లాంగ్‌ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మృతికి భారత ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

First Published:  27 July 2015 10:16 AM GMT
Next Story