విద్యార్థిని ఆత్మహత్యపై హైకోర్టు విచారణ జరపాలి " రోజా
నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకేసును ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని, రిషితేశ్వరి సూసైట్ నోటు చూసినవారికి కన్నీరు వస్తున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ముగ్గురు మహిళా మంత్రులుండి కూడా తహసీల్దార్ వనజాక్షికి అన్యాయం జరిగిందని ఆమె […]
BY Pragnadhar Reddy25 July 2015 6:36 PM IST
X
Pragnadhar Reddy Updated On: 26 July 2015 4:50 AM IST
నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకేసును ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని, రిషితేశ్వరి సూసైట్ నోటు చూసినవారికి కన్నీరు వస్తున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ముగ్గురు మహిళా మంత్రులుండి కూడా తహసీల్దార్ వనజాక్షికి అన్యాయం జరిగిందని ఆమె అన్నారు.
Next Story