ముఖ్యమంత్రిగా మొదటి తీర్మానం వాల్మీకులపైనే " వైఎస్ జగన్
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అనంతపురం పర్యటనలో హామీ ఇచ్చారు. అనంతలో ఐదో రోజు నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ఆయన బోయలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కర్నాటకలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో బీసీలుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఎస్టీలుగా ఉంటేనే తమ పిల్లలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అందువల్ల ఆంధ్రాలో కూడా బోయలను ఎస్టీలుగా గుర్తించాలని వారు జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బోయల విజ్ఞప్తికి స్పందించిన జగన్ ముఖ్యమంత్రిగా […]
BY Pragnadhar Reddy26 July 2015 4:04 AM IST
X
Pragnadhar Reddy Updated On: 26 July 2015 4:04 AM IST
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి అనంతపురం పర్యటనలో హామీ ఇచ్చారు. అనంతలో ఐదో రోజు నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ఆయన బోయలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కర్నాటకలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో బీసీలుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఎస్టీలుగా ఉంటేనే తమ పిల్లలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అందువల్ల ఆంధ్రాలో కూడా బోయలను ఎస్టీలుగా గుర్తించాలని వారు జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బోయల విజ్ఞప్తికి స్పందించిన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బోయలను ఎస్టీల్లో చేర్చాలా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ చలువ వల్ల హంద్రీనీవా ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందని, మిగిలిన 15 శాతం పనులు పూర్తయ్యేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించడం లేదని జగన్ ఆరోపించారు. ప్రాజెక్టు పనులకు నిధులివ్వని చంద్రబాబు అనంతలో పర్యటించిన ప్రతిసారీ అనంతకు నేనే నీళ్లిచ్చానని అబద్దాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు. రైతులను, మహిళలను అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు తొందర్లోనే బుద్ది చెబుతారని అన్నారు.
Next Story