కోదండరామ్ హైకోర్టు ఉద్యమానికి కేసిఆర్ మద్దతిస్తారా ?
తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా మొదలుపెట్టింది కేసీఆర్. పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసింది మాత్రం కోదండరామే! ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. జేఏసీ పేరిట రాజకీయ పార్టీలను ఒక్కవేదికపై తీసుకువచ్చిన ఘనత ఆయనది. పట్టణాలు, గ్రామాలు, వీధుల్లో జేఏసీలు ఏర్పాటు చేయించారు. ప్రజలందరినీ ఐక్యం చేశారు. సబ్బండ కులాలను, అణగారినవర్గాలను, నిరక్షరాస్యులను, కార్మికులను, రైతులను, మహిళలను, కార్మిక సంఘాలను ఒక్కతాటిపైకి తీసుకు వచ్చారు. ఆ చైతన్యంతోనే ప్రతి తెలంగాణ బిడ్డ పోరాటంలో ముందుకు కదిలాడు. ఒకదశలో కేసీఆర్ చెప్పినా […]
BY Pragnadhar Reddy26 July 2015 5:12 AM IST
X
Pragnadhar Reddy Updated On: 26 July 2015 7:21 AM IST
తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా మొదలుపెట్టింది కేసీఆర్. పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసింది మాత్రం కోదండరామే! ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. జేఏసీ పేరిట రాజకీయ పార్టీలను ఒక్కవేదికపై తీసుకువచ్చిన ఘనత ఆయనది. పట్టణాలు, గ్రామాలు, వీధుల్లో జేఏసీలు ఏర్పాటు చేయించారు. ప్రజలందరినీ ఐక్యం చేశారు. సబ్బండ కులాలను, అణగారినవర్గాలను, నిరక్షరాస్యులను, కార్మికులను, రైతులను, మహిళలను, కార్మిక సంఘాలను ఒక్కతాటిపైకి తీసుకు వచ్చారు. ఆ చైతన్యంతోనే ప్రతి తెలంగాణ బిడ్డ పోరాటంలో ముందుకు కదిలాడు. ఒకదశలో కేసీఆర్ చెప్పినా బందులు జరగలేదు. అదే బంద్ పిలుపు కోదండరామ్ నోటి నుంచి వస్తే తెలంగాణ స్తంభించిపోయింది. జేఏసీ నుంచి కాంగ్రెస్, టీడీపీలు వెళ్లిపోయినా, టీఆర్ ఎస్ అంటీముట్టనట్లు ఉన్నా.. కోదండరామ్ పిలుపునకు పార్టీల కతీతకంగా కదిలారు ప్రజలు. సకల జనుల సమ్మె, సాగరహారం ఉద్యమంతో తెలంగాణ సమాజ ఆకాంక్షను కేంద్రానికి బలంగా చాటింది ఆయనే!
హైకోర్టు కోసం మరో పోరాటం చేస్తానని జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. ఇందుకోసం విద్యార్థులను, న్యాయవాదులను ఐక్యం చేయడంతోపాటు, సామాన్యులను సైతం భాగస్వామ్యం చేసేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణలో రాజకీయ మద్దతు లభిస్తుందా? లభిస్తే ఎవరి నుంచి? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ కలిసి రాదు, కాంగ్రెస్ మాట వినదు ఇకమిగిలింది.. టీఆర్ ఎస్! తనకు సమాంతరంగా ఎదుగుతున్నారన్న భయంతో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కావాలనే కోదండరామ్‌ను పక్కన బెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆయనకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోదండరామ్ హైకోర్టు కోసం ఉద్యమం ప్రారంభిస్తే.. కనీసం కేసీఆర్ అయినా సహకరిస్తారా? అన్న ప్రశ్న తెలంగాణ సమాజంలో ఉదయించింది. కోదండరామ్ ఏ ఉద్యమం చేపట్టినా పక్కా ప్రణాళికతో ముందుకు వెళతారు. కోదండరామ్ చేపట్టిన సాగరహారానికి ఏపార్టీలు మద్దతివ్వలేదు. అయినా లక్షలాదిమంది జిల్లాల నుంచి తరలిరావడంతో విజయవంతం అయిందని జేఏసీ నేతలు గుర్తుచేస్తున్నారు. అందరినీ తనతో కలుపుకోగల రాజనీతిజ్ఞుడు కోదండరామ్ అని, చివరికి ఆయనకు అందరూ మద్దతు తెలపాల్సిన పరిస్థితి వస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నారు.
Next Story