పట్టాలపైకి పురపాలన
ఎట్టకేలకు సమ్మె పరిష్కారం..16 రోజుల ఉద్యమానికి తెర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. మున్సిపల్ కార్మిక సంఘ నాయకులతో సుదీర్ఘంగా చర్చించి, కొన్ని డిమాండ్లను అంగీకరించింది. దీంతో 16 రోజుల మున్సిపల్ కార్మికుల సమ్మెకు తెరపడింది. మున్సిపల్ కార్మికుని కనీస వేతనం రూ.2,700 పెంచేందుకు నిర్ణయించింది. సమ్మె కాలాన్ని సెలవు కాలంగా పరిగణించేందుకు అంగీకరించింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కార్మిక సంఘ జెఎసి నాయకులతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం పలు దఫాలు చర్చలు […]
BY Pragnadhar Reddy26 July 2015 12:16 AM IST
X
Pragnadhar Reddy Updated On: 26 July 2015 11:21 AM IST
ఎట్టకేలకు సమ్మె పరిష్కారం..16 రోజుల ఉద్యమానికి తెర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. మున్సిపల్ కార్మిక సంఘ నాయకులతో సుదీర్ఘంగా చర్చించి, కొన్ని డిమాండ్లను అంగీకరించింది. దీంతో 16 రోజుల మున్సిపల్ కార్మికుల సమ్మెకు తెరపడింది. మున్సిపల్ కార్మికుని కనీస వేతనం రూ.2,700 పెంచేందుకు నిర్ణయించింది. సమ్మె కాలాన్ని సెలవు కాలంగా పరిగణించేందుకు అంగీకరించింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కార్మిక సంఘ జెఎసి నాయకులతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం పలు దఫాలు చర్చలు జరిపింది. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.14,300కు పెంచాలని కార్మిక సంఘ నాయకులు పట్టుపట్టారు. గతంలోనే ప్రస్తుతం ఇస్తున్న జీతం రూ.8,300కు అదనంగా రూ.2 వేలు పెంచుతామని మంత్రివర్గ ఉపసంఘం తేల్చి చెప్పింది. తాజా చర్చల్లో మరో రూ.700 పెంచి, మొత్తంగా రూ.2,700లు పెంచేందుకు ఒప్పుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కార్మిక సంఘాలు ఒప్పుకోవాలని కోరింది. దీనిపై పలుమార్లు ఆలోచించిన కార్మిక సంఘ నాయకులు ఎట్టకేలకు ఒప్పుకున్నారు. పెంచిన జీతాలు రెండేళ్లకే వర్తిస్తాయనీ, పదో పిఆర్‌సి అమలు కానందున రెండేళ్లకోసారి జీతాలు పెంచా లని కార్మిక సంఘ నాయకులు కోరడంతో మంత్రి వర్గం అంగీకరించింది. మున్సిపల్ ఇంజినీరింగ్ విభా గంలో పనిచేసే స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కేటగిరిలలో ఉన్న 40 వేల కాంట్రాక్టు కార్మికుల జీతాల విషయంలో, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఈ కేటగిరి ఉద్యోగుల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. వీరందరికీ ఒకేసారి జీతాల పెంపుదల విషయం కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు. పదహారు రోజుల సమ్మె కాలాన్ని సెలవు పీరియడ్‌గా పరిగణించేందుకు నిర్ణయించారు. ఈ సమ్మె కాలాన్ని తర్వాత పనిచేసేందుకు అంగీకారం కుదిరింది. మున్సిపల్ కార్మికుల జీతాలు 010 హెడ్‌పై ఇచ్చేందుకు త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రులు, కార్మిక సంఘ నాయకులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ కార్మికులకు రూ.2,700 చొప్పున వేతనం పెంచడం వలన రాష్ట్రంపై రూ.150 కోట్ల ఆర్థిక భారం పడుతుందని యనమల తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే స్కిల్డ్, అన్‌స్కిల్డ్, కాంట్రాక్టు వర్కర్ల జీతాలు పెంచేందుకు త్వరలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుం టామన్నారు. రాష్ట్రంలో 70వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉన్నందున పెంచాల్సిన అవసరముందనీ తెలిపారు. కాగా చర్చల విషయంలో పూర్తి సంతృప్తిగా లేనప్పటికీ సమ్మె విరమణకు ఒప్పుకుంటున్నామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. పదహారు రోజుల సమ్మెను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇంజినీరింగ్ వర్కర్ల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోకపోతే తిరిగి సమ్మెకు సిద్ధమవుతామనీ హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు కోరిన విధంగా రాష్ట్రప్రభుత్వం స్పందించలేదని ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంధ్రనాద్ చెప్పారు. ప్రభుత్వం పెంచిన కొద్ది జీతాన్ని భారంతో పెంచామని చెప్పిందన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ ఉద్యోగుల జీతాలు పెంచకపోతే తిరిగి ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు.
Next Story