Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 155

ధైర్యం టీచర్‌: రీటా! మీరు భోజనానికి ముందు ప్రార్థన చేస్తారా! రీటా: చెయ్యం టీచర్‌! మా అమ్మ వంట బాగానే వండుతుంది. ——————————————– తాడు చెడిపోయిన ట్రక్కును తాడుతో కట్టి ఇంకో ట్రక్కు లాక్కుపోతూవుంటే చూసి ఒకతను “ఒక తాడును తీసుకెళ్ళడానికి రెండు ట్రక్కులా” అని ఆశ్చర్యపోయాడు! ——————————————– వీరుడు “టీచర్‌ పిల్లల్తో “ఎవరైనా తోడేలును ముఖాముఖీ ఎదుర్కొన్నారా!” అని అడిగింది. ఒక కుర్రాడు చేయిపైకి ఎత్తాడు… అతని అనుభవం చెప్పాడు. “సమీపంలో ఎవరూ లేరు. తోడేలు […]

ధైర్యం
టీచర్‌: రీటా! మీరు భోజనానికి ముందు ప్రార్థన చేస్తారా!
రీటా: చెయ్యం టీచర్‌! మా అమ్మ వంట బాగానే వండుతుంది.
——————————————–
తాడు
చెడిపోయిన ట్రక్కును తాడుతో కట్టి ఇంకో ట్రక్కు లాక్కుపోతూవుంటే చూసి ఒకతను
“ఒక తాడును తీసుకెళ్ళడానికి రెండు ట్రక్కులా” అని ఆశ్చర్యపోయాడు!
——————————————–
వీరుడు
“టీచర్‌ పిల్లల్తో “ఎవరైనా తోడేలును ముఖాముఖీ ఎదుర్కొన్నారా!” అని అడిగింది.
ఒక కుర్రాడు చేయిపైకి ఎత్తాడు… అతని అనుభవం చెప్పాడు.
“సమీపంలో ఎవరూ లేరు. తోడేలు ముందుకు వస్తోంది. నేను దాని కళ్లలో కళ్లు ఉంచాను. ఇంకా ముందుకు వచ్చింది. దాదాపు నా దగ్గరకొచ్చింది.”
టీచర్‌ ఆశ్చర్యంతో “మరి ఎట్లా తప్పించుకున్నావు?”
“నేనున్నది జూలో. ఆ బోను దగ్గర్నించీ ఇంకో బోను దగ్గరకు వెళ్ళిపోయాను” అన్నాడు.

First Published:  25 July 2015 6:33 PM IST
Next Story