వెంకయ్యా.. గద్దె దిగు!
ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి విద్యార్థి జెఎసి ఆయన నివాసం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెఎసి నాయకులు బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించే ఎపి విద్యార్థి జెఎసి చైర్మన్ ఎల్.గోవిందరావు మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హౌదాపై కేంద్రాన్ని నిలదీయకుండా వెంకయ్యనాయుడు ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నాడు బిజెపి తరపున […]
BY Pragnadhar Reddy25 July 2015 6:49 PM IST
Pragnadhar Reddy Updated On: 26 July 2015 12:24 PM IST
ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి విద్యార్థి జెఎసి ఆయన నివాసం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెఎసి నాయకులు బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించే ఎపి విద్యార్థి జెఎసి చైర్మన్ ఎల్.గోవిందరావు మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హౌదాపై కేంద్రాన్ని నిలదీయకుండా వెంకయ్యనాయుడు ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నాడు బిజెపి తరపున పదేళ్ల ప్రత్యేక హౌదా అడిగిన వెంకయ్య ఇప్పుడు కనబడకుండా దాక్కొంటున్నారని విమర్శించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ప్రత్యేక హౌదా ప్రకటించాలని…లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
Next Story