సినీ దర్శకులపై మండిపడ్డ పోలీసాఫీసర్
ఇటీవల ఒక ఆంధ్రా పోలీస్ ఆఫీసర్ జర్నలిస్టులతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డ్ అంటూ సినీ దర్శకుల్ని బండ బూతులు తిట్టాడు. విషయం ఏమిటంటే అనేక సినిమాల్లో విలన్‌లు ఎవరినైనా హత్య చేసినా, దాడి చేసినా, గాయపరచినా బాధితులు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కేస్ పెట్టబోయినా, ఫోన్ చేసి పోలీస్ సహాయం అర్దించినా ఆ ఏరియా మా పరిధిలోకి రాదు ఫలానా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి అంటూ చెప్పడాన్ని సినిమాల్లో తరుచూ చూపించి పోలీసుల్ని విమర్శిస్తుంటారు. […]
ఇటీవల ఒక ఆంధ్రా పోలీస్ ఆఫీసర్ జర్నలిస్టులతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డ్ అంటూ సినీ దర్శకుల్ని బండ బూతులు తిట్టాడు.
విషయం ఏమిటంటే అనేక సినిమాల్లో విలన్‌లు ఎవరినైనా హత్య చేసినా, దాడి చేసినా, గాయపరచినా బాధితులు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కేస్ పెట్టబోయినా, ఫోన్ చేసి పోలీస్ సహాయం అర్దించినా ఆ ఏరియా మా పరిధిలోకి రాదు ఫలానా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి అంటూ చెప్పడాన్ని సినిమాల్లో తరుచూ చూపించి పోలీసుల్ని విమర్శిస్తుంటారు. నేరం జరిగినప్పుడు ముందు అటెండ్ కావాలి కానీ ఈ సరిహద్దు గొడవలేమిటని ప్రజలు పోలీసుల్ని తిట్టుకునేలాగా చిత్రీకరిస్తుంటారు.
ఇప్పుడు చూశారు కదా! ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే పోయి పట్టుకోబోయిన వనజాక్షి పరిస్థితి ఏమైందో! నీ సరిహద్దు లోపల జరగలేదు కదా! అని సాక్షాత్తు ముఖ్యమంత్రే మందలించాడు గానీ, ఎక్కడయితేనేం నేరం జరుగుతుంటే పట్టుకున్నావు సెహబాష్! అని మేచ్చుకున్నాడా? కనీసం మీ పత్రికల వాళ్ళయినా ఆ విషయం రాశారా ?
మరి అలాంటప్పుడు మమ్మల్ని విమర్శించే ఈ సినిమావాళ్ళకు బుద్ధుందా? అని క్లాస్ పీకాడట!.