పాకిస్థాన్‌కి విజయేంద్ర ప్రసాద్!
ప్రముఖ కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కల నెరవేరనుంది. త్వరలోనే ఆయన పాకిస్థాన్ వెళ్లనున్నారు. తన చిరకాల వాంఛను తీర్చుకోబోతున్నారు. సూపర్‌హిట్ సినిమాల రచయితగా., బాహుబలి సృష్టికర్తగా.,రాజమౌళి తండ్రిగా ఆయన సుపరిచితుడు. ఇటీవల బాలీవుడ్‌లో సూపర్‌డూపర్ హిట్ అయిన భజరంగి భాయిజాన్ స్ర్కిప్ట్ రైటర్‌గా ఆయన పేరు దేశమంతా మారుమోగుతోంది. ఒక చిన్నారి కన్నీళ్లతో రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలను, అపోహలను కడిగిపడేశారు విజయేంద్ర ప్రసాద్. ఇండోపాక్ ప్రజల్లో మనసు పొరల్లో దాగివున్నప్రేమానుబంధాలను కళ్లలో ఉబికివచ్చేలా చేశారు. దేశాలు, మతాలు […]
ప్రముఖ కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కల నెరవేరనుంది. త్వరలోనే ఆయన పాకిస్థాన్ వెళ్లనున్నారు. తన చిరకాల వాంఛను తీర్చుకోబోతున్నారు. సూపర్‌హిట్ సినిమాల రచయితగా., బాహుబలి సృష్టికర్తగా.,రాజమౌళి తండ్రిగా ఆయన సుపరిచితుడు. ఇటీవల బాలీవుడ్‌లో సూపర్‌డూపర్ హిట్ అయిన భజరంగి భాయిజాన్ స్ర్కిప్ట్ రైటర్‌గా ఆయన పేరు దేశమంతా మారుమోగుతోంది.
ఒక చిన్నారి కన్నీళ్లతో రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలను, అపోహలను కడిగిపడేశారు విజయేంద్ర ప్రసాద్. ఇండోపాక్ ప్రజల్లో మనసు పొరల్లో దాగివున్నప్రేమానుబంధాలను కళ్లలో ఉబికివచ్చేలా చేశారు. దేశాలు, మతాలు వేరైనా హ్యూమన్ ఎమోషన్స్ ఒక్కటేనని నిరూపించారు. అందుకే రెండుదేశాల మధ్య శాంతిని కోరుకునే వ్యక్తులకు, సంస్థలకు ఇప్పుడాయన ఫేవరెట్‌గా మారారు.
పాతబస్తీకిచెందిన కాన్ఫెడరేషన్ వలంటరీ ఆర్గనైజేషన్స్ వంటి సంస్థలు
విజయేంద్రప్రసాద్‌ని కలిశాయి. జీవితంలో ఒక్కసారైనా పాకిస్థాన్‌కి వెళ్లి అక్కడి జీవితాలను కళ్లారా చూడాలని ఎంతోకాలంగా విజయేంద్రప్రసాద్ తపిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాతబస్తీ సంస్థ..ఆయన్నుసగౌరవంగా పాకిస్థాన్‌కి తీసుకువెళ్లడానికి సిద్ధమని సంస్థ ప్రతినిధి మాజిర్ హుస్సేన్ ప్రకటించారు.
ఏటా ఆగస్టు 14,15 తేదీల్లో ఎంపికచేసిన వ్యక్తులు పాకిస్థాన్‌కి వెళతారు. అలాగే పాకిస్థాన్ నుంచి కూడా ప్రముఖులు ఇండియాకి వస్తారు. ఈసారి ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్‌నయ్యర్ నేతృత్వంలోని బృందం పాకిస్థాన్ వెళుతోంది. వారితోబాటు విజయేంద్రప్రసాద్ పాక్‌కి వెళ్లే అవకాశం ఉంది. సరిహద్దులకు అవతల ప్రపంచం చూడాలనీ., పాక్ ప్రజలతో మాట్లాడాలనీ ఆయన భావిస్తున్నారు. మొత్తానికి సల్మాన్‌ఖాన్‌కి కెరీర్ బెస్ట్ మూవీని అందించిన భజరంగీ పుణ్యమాని విజయేంద్రప్రసాద్ కల కూడా నెరవేరబోతోంది.