కొట్టుకోవడంతోనే సరిపోతోంది
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార విపక్షాలు కొట్టుకోవడంతోనే సరిపోతోంది. ఆరోపణలు-ప్రత్యారోపణలు తప్ప చర్చలు లేవు. పరిష్కరాలు అంతకంటే లేవు. ఒకరినొకరు కార్నర్ చేసుకోవడంతప్ప హూందాగా సభను నడిపిన పాపానపోలేదు. వర్షాకాల సమావేశాల్లో నాలుగురోజులు వృథాగా కరిగిపోయాయి. లోక్‌సభలో 94శాతం, రాజ్యసభలో 88శాతం సమయం వృథా అయిందని పిఆర్ఎస్ డేటా చెబుతోంది. లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలంటూ రగడ జరుగుతోంది. ఆ ఒక్కటీ అడక్కు అంటూ మోదీ సర్కారు భీష్మించుకుని కూర్చుంది. శుక్రవారం లోక్‌సభ మొదలైన […]
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార విపక్షాలు కొట్టుకోవడంతోనే సరిపోతోంది. ఆరోపణలు-ప్రత్యారోపణలు తప్ప చర్చలు లేవు. పరిష్కరాలు అంతకంటే లేవు. ఒకరినొకరు కార్నర్ చేసుకోవడంతప్ప హూందాగా సభను నడిపిన పాపానపోలేదు. వర్షాకాల సమావేశాల్లో నాలుగురోజులు వృథాగా కరిగిపోయాయి. లోక్‌సభలో 94శాతం, రాజ్యసభలో 88శాతం సమయం వృథా అయిందని పిఆర్ఎస్ డేటా చెబుతోంది. లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలంటూ రగడ జరుగుతోంది. ఆ ఒక్కటీ అడక్కు అంటూ మోదీ సర్కారు భీష్మించుకుని కూర్చుంది. శుక్రవారం లోక్‌సభ మొదలైన నాలుగు నిమిషాల్లోనే వాయిదాపడింది.
2009 వింటర్ సెషన్‌లో కూడా ఇలాగే 94శాతం సభాసమయం వృథా అయింది. 2జీ కుంభకోణంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సభను పూర్తిగా అడ్డుకుంది. అంతకుముందు ఆయిల్ స్కామ్‌లో నట్వర్‌సింగ్ రాజీనామా చేసేంతవరకు సుష్మాస్వరాజ్ నిద్రపోలేదు. ఇప్పుడు లలిత్‌గేట్ స్కామ్‌లో ఆమె రాజీనామా చేస్తే తప్ప సభ జరగనివ్వమంటున్నారు కాంగ్రెస్ నేతలు! అయినా బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. అధికార పక్షంలో ఉండి కూడా అడ్డగోలుగా ఎదురుదాడి చేస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది.
ధర్నా చేసిన అధికార పక్షంః
ప్రతిపక్షాలు ఆందోళన చేయడం., పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేయడం సహజం. కానీ అధికార బీజేపీ సభ్యులకు సభ ప్రారంభానికి ముందే ఎస్ఎంఎస్‌లు వెళ్లాయి. అంతా గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చేయమని! అంతే..సోనియా, రాహుల్ షేమ్ షేమ్..సభను జరగనివ్వాలి..కాంగ్రెస్పాలి
ఇదేం విడ్డూరం?
బీజేపీ ఎంపీలు తమకంటే ముందు గాంధీ విగ్రహం దగ్గర చోటును ఆక్రమించుకోవడం చూసి కాంగ్రెస్ ఎంపీలు కంగుతిన్నారు. ధర్నా చేయాల్సింది తాముకదా అని అయోమయంలో పడ్డారు. అసలు ధర్నాచేసే హక్కు బీజేపీకి ఉందా? అధికారపక్షంలో ఉండి..ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? ఆ దేవుడినా? అని జేడీయూ నేత శరద్‌యాదవ్ మండిపడ్డారు. ..బహుశా అమెరికా అధ్యక్షుడికేమో అంటూ ఆమ్ ఆద్మీపార్టీనేత కుమార్ విశ్వాస్ సెటైర్ విసిరారు. ఇలా ధర్నాలు, ఆందోళనలు చేయడంకంటే లలిత్‌గేట్, వ్యాపం వ్యవహారాల్లో బాధ్యులపై చర్య తీసుకోవాలని బిఎస్పీ చీఫ్ మాయావతి హితవు పలికారు. అయితే ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడంతో చేసేదిలేక అధికారపక్షంలో ఉండి కూడా ధర్నా చేయాల్సివచ్చిందంటున్నారు కమలనాథులు!