మా ప్రభుత్వంలోనే పప్పుధాన్యాల ధరలు పెరిగాయి " ఆహారశాఖమంత్రి
ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పప్పుధాన్యాల ధరలు 41 శాతం పెరిగాయి. గత ఏడాది వరకూ రూ. 80 పలికిన కందిపప్పు ఇప్పుడు రూ. 120 పైమాటే పలుకుతున్నాయి. దీంతో సామాన్యుడు ముద్దపప్పు, సాంబారుకు కూడా మొహం వాచే పరిస్థితి నెలకొందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర ఆహారశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అంగీకరించారు. ఎన్‌డిఎ హయంలో పప్పు ధరలు 41 శాతం పెరిగాయని ఆయన శుక్రవారం రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. […]
ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పప్పుధాన్యాల ధరలు 41 శాతం పెరిగాయి. గత ఏడాది వరకూ రూ. 80 పలికిన కందిపప్పు ఇప్పుడు రూ. 120 పైమాటే పలుకుతున్నాయి. దీంతో సామాన్యుడు ముద్దపప్పు, సాంబారుకు కూడా మొహం వాచే పరిస్థితి నెలకొందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర ఆహారశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అంగీకరించారు. ఎన్‌డిఎ హయంలో పప్పు ధరలు 41 శాతం పెరిగాయని ఆయన శుక్రవారం రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల గతేడాది జూలై నుంచి ఈ జూన్ కాలంలో 20 లక్షల టన్నుల పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల వల్ల పప్పుదినుసుల దిగుమతులు తగ్గడంతో రీటైల్ ధరలు 12.63 శాతం నుంచి 40.73 శాతానికి పెరిగాయని మంత్రి సభకు తెలిపారు. గత ఏడాదిలో పెసరపప్పు సగటున 12.63 శాతం పెరగ్గా, మినపపప్పు 34.39శాతం, కందిపప్పు 40.73శాతం, మైసూర్‌పప్పు 23శాతం, శనగపప్పు 30.53శాతం పెరిగాయని మంత్రి వెల్లడించారు. పప్పు దినుసుల ధరలను నియంత్రించడానికి దిగుమతులను పెంచాలని నిర్ణయించినట్లు ఆయన సభకు తెలిపారు.