గవర్నర్ పదవి ఊడిపోనుందా?
రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవి త్వరలో ఊడిపోనుందా? ఆయనను గవర్నర్‌గా ఏదో ఒక రాష్ర్టానికి పరిమితం చేసి మరో రాష్ర్టానికి కొత్త గవర్నర్‌ను నియమిస్తారన్న ఊహాగానాలు కూడా తేలిపోయాయి. మొత్తానికి రెండు రాష్ర్టాలకు ఇద్దరు కొత్త గవర్నర్లు రాబోతున్నారని కూడా స్పష్టమైపోయింది. ఎలా అనుకుంటున్నారా..? ఈ విషయాన్ని పరోక్షంగా ఆయనే బైటపెట్టారు. అతి త్వరలో తాను ఓ సాధారణ పౌరుడిని కాబోతున్నానంటూ నరసింహన్ ఓ రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఇండో గ్లోబల్ […]
BY sarvi24 July 2015 4:28 AM IST
X
sarvi Updated On: 24 July 2015 4:28 AM IST
రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవి త్వరలో ఊడిపోనుందా? ఆయనను గవర్నర్‌గా ఏదో ఒక రాష్ర్టానికి పరిమితం చేసి మరో రాష్ర్టానికి కొత్త గవర్నర్‌ను నియమిస్తారన్న ఊహాగానాలు కూడా తేలిపోయాయి. మొత్తానికి రెండు రాష్ర్టాలకు ఇద్దరు కొత్త గవర్నర్లు రాబోతున్నారని కూడా స్పష్టమైపోయింది. ఎలా అనుకుంటున్నారా..? ఈ విషయాన్ని పరోక్షంగా ఆయనే బైటపెట్టారు. అతి త్వరలో తాను ఓ సాధారణ పౌరుడిని కాబోతున్నానంటూ నరసింహన్ ఓ రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్ ఫార్మా సదస్సులో కీలకోపన్యాసం సందర్భంగా నరసింహన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను సాధారణ పౌరుడిని కాబోతున్నానని తన ప్రసంగంలో ఆయన బైటపెట్టారు. వైద్య విజ్ఞాన రంగంలో నూతన ఆవిష్కరణలు ఆసక్తి రేకెత్తిస్తున్నా రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులు సామాన్యుడిని వైద్యానికి దూరం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సందర్భంగానే తానూ సామాన్యుడిని కాబోతున్నానని ఆయన అనుకోకుండా బైటపెట్టేశారు.
Next Story