కొండెక్కిన ఉల్లి
వంటిట్లో ఉల్లిపాయలు కట్ చేయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. అందుకు కారణం ఉల్లి ధర అమాంతం ఎగబాకడమే. నిన్న మొన్నటి దాకా కిలో రూ. 15 నుంచి రూ.20 పలికిన ఉల్లిపాయలు ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్లోనే రూ 35 నుంచి రూ. 40 పలుకుతున్నాయి. రీటైల్ మార్కెట్లో వీటి ధర రూ. 50 పైమాటే. దీంతో వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగడానికి కారణం అకాల వర్షాలకు దిగుబడి తగ్గడం, గోదాముల్లో నిల్వ చేసిన ఉల్లి […]
BY sarvi23 July 2015 6:41 PM IST
sarvi Updated On: 24 July 2015 6:55 AM IST
వంటిట్లో ఉల్లిపాయలు కట్ చేయకుండానే కన్నీరు తెప్పిస్తున్నాయి. అందుకు కారణం ఉల్లి ధర అమాంతం ఎగబాకడమే. నిన్న మొన్నటి దాకా కిలో రూ. 15 నుంచి రూ.20 పలికిన ఉల్లిపాయలు ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్లోనే రూ 35 నుంచి రూ. 40 పలుకుతున్నాయి. రీటైల్ మార్కెట్లో వీటి ధర రూ. 50 పైమాటే. దీంతో వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగడానికి కారణం అకాల వర్షాలకు దిగుబడి తగ్గడం, గోదాముల్లో నిల్వ చేసిన ఉల్లి పాడవడమేనని అధికారులు అంటున్నారు. దేశీయ మార్కెట్లో ఉల్లి కొరత ఏర్పడకుండా చూసేందుకు, ధర నియంత్రించేందుకు కేంద్రం ఉల్లిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.
Next Story