ఇవి తింటే కొవ్వు మాయం..!
మన శరీరంలో పేరుకుపోయే కొవ్వు నిల్వలను కరిగించడం ఎలా? బ్యాడ్ కొలెస్ర్టాల్‌ను తొలగించే ఆహార పదార్థాలు ఏమిటి? ఇవి ఇపుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు… కొవ్వు కరిగించాలంటే క్లిష్టమైన ఎక్సర్‌సైజులే చేయనక్కరలేదు. మన ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా కూడా కొవ్వును కరిగించవచ్చని నిపుణులు అంటున్నారు. మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలలోనే అలాంటి అనేక సౌలభ్యాలున్నాయి. వాటిలో ముఖ్యంగా కొవ్వు కరిగించే ఆహారపదార్థాలేమిటో చూద్దామా..? రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ చక్కగా […]
BY sarvi24 July 2015 6:36 AM IST
X
sarvi Updated On: 24 July 2015 6:48 AM IST
మన శరీరంలో పేరుకుపోయే కొవ్వు నిల్వలను కరిగించడం ఎలా? బ్యాడ్ కొలెస్ర్టాల్‌ను తొలగించే ఆహార పదార్థాలు ఏమిటి? ఇవి ఇపుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు… కొవ్వు కరిగించాలంటే క్లిష్టమైన ఎక్సర్‌సైజులే చేయనక్కరలేదు. మన ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా కూడా కొవ్వును కరిగించవచ్చని నిపుణులు అంటున్నారు. మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలలోనే అలాంటి అనేక సౌలభ్యాలున్నాయి. వాటిలో ముఖ్యంగా కొవ్వు కరిగించే ఆహారపదార్థాలేమిటో చూద్దామా..?
రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ చక్కగా ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని ఇది తగ్గిస్తుంది. ఆపిల్ లోని మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది. బీన్స్ లో ఉండే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్.. కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి. బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. వంకాయలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ మాత్రమే కాక ఫైటో న్యూట్రియంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి. ఆంతో సైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్ష లోని పొటాషియం, శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. తాజా జామపండ్లు శరీరానికెంతో మేలు చేస్తాయి. జామలోని విటమిన్ సి, భాస్వరం, నికోటిన్ ఆమ్లం, కరిగేపీచు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను సంరక్షిస్తాయి. పుట్టగొడుగులలోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించడంలో బాగా ఉపయోగాపడతాయి. బాదంలోని ఒలియిక్ ఆమ్లం… గుండెను వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఎనిమిది రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృత్తులు సోయాలో వున్నాయి. సోయా మాంసకృత్తులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తం నుండి కొలెస్ట్రాలును విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది.
Next Story