కప్ప ఆకృతి శిశువుకు జన్మనిచ్చిన తల్లి
కప్ప పాపను ఎక్కడైనా చూశారా, పోనీ విన్నారా … లేదు కదూ. అయితే, అత్యంత అరుదైన ఈ సంఘటన నేపాల్‌లోని డోల్కా జిల్లా చారికోట్‌లోని గౌరీశంకర్ హాస్పటల్లో చోటు చేసుకుంది. నీర్ బహదూర్ కార్కి, శుంతాలి కార్కి దంపతులకు అచ్చు కప్ప మాదిరిగానే ఉన్న పాప జన్మించింది. శుంతాలి కార్కికి పుట్టిన నవజాత శిశువును చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్య పోయారు. ఈ పాప శరీరంలో అవయవాలన్నీ అసాధారణంగానే ఉన్నాయి. మెడ లేకుండా వీపు భాగం […]
BY sarvi24 July 2015 6:12 AM IST
X
sarvi Updated On: 24 July 2015 6:12 AM IST
కప్ప పాపను ఎక్కడైనా చూశారా, పోనీ విన్నారా … లేదు కదూ. అయితే, అత్యంత అరుదైన ఈ సంఘటన నేపాల్‌లోని డోల్కా జిల్లా చారికోట్‌లోని గౌరీశంకర్ హాస్పటల్లో చోటు చేసుకుంది. నీర్ బహదూర్ కార్కి, శుంతాలి కార్కి దంపతులకు అచ్చు కప్ప మాదిరిగానే ఉన్న పాప జన్మించింది. శుంతాలి కార్కికి పుట్టిన నవజాత శిశువును చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్య పోయారు. ఈ పాప శరీరంలో అవయవాలన్నీ అసాధారణంగానే ఉన్నాయి. మెడ లేకుండా వీపు భాగం తలతో మమేకమై పోయింది. పెద్దపెద్ద కనురెప్పలు, అసాధారణ సైజులో కళ్ళు అచ్చు కప్పలాగా పుట్టిన పాపను చూసి డాక్టర్లు మొదట ఆశ్యర్య పోయినా, ఒక్కోసారి ఇలాంటి శిశువులు పుట్టడం సహజమేనని చెప్పారు. పాప తల్లి గర్భంతో ఉన్నప్పుడు నదిలో స్నానం చేసి ఉండవచ్చని ఆ సమయంలో కప్ప లార్వా గుడ్లు ఆమెకు తెలియకుండానే శరీరంలోకి వెళ్లి ఫలదీకరణ చెంది ఉండవచ్చని… దీనివల్లే ఇలాంటి అరుదైన ఆకృతితో ఉన్న శిశువు జన్మించిందని డాక్టర్లు అంటున్నారు. అయితే, ఈ శిశువు జన్మించిన అరగంటకే మరణించింది. పుట్టిన బిడ్ద చనిపోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, భార్యకు ఏమీ కానందుకు సంతోషంగా ఉందని నీర్ బహదూర్ అన్నారు.
Next Story