మాస్టర్ ప్లాన్ కాదు.. వ్యాపార ప్లాన్!
ధర్మాన ఎద్దేవా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని, కానీ వాస్తవానికి అది వ్యాపార ప్లాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పదవి నధిష్టించినపుడే సింగపూర్ ప్రయివేటు సంస్థలతో రాజధానిపై ఒప్పందాలు కుదుర్చుకున్నారని అన్నారు. లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఆయన సింగపూర్ కంపెనీలతో ఎప్పుడో మాట్లాడేసుకున్నాడని చెప్పారు. […]
BY sarvi24 July 2015 6:19 AM IST
X
sarvi Updated On: 24 July 2015 6:19 AM IST
ధర్మాన ఎద్దేవా
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని, కానీ వాస్తవానికి అది వ్యాపార ప్లాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పదవి నధిష్టించినపుడే సింగపూర్ ప్రయివేటు సంస్థలతో రాజధానిపై ఒప్పందాలు కుదుర్చుకున్నారని అన్నారు. లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఆయన సింగపూర్ కంపెనీలతో ఎప్పుడో మాట్లాడేసుకున్నాడని చెప్పారు. రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగలేదని, అవన్నీ సింగపూర్ సంస్థలతోనే అనే విషయం ఇపుడు స్పష్టంగా తేలిపోయిందన్నారు. సింగపూర్ లో ఏం సంస్థలకు రాజధాని పనులు అప్పగించాలి.. వారి నుంచి మనం ఏం తీసుకోవాలి వంటివన్నీ చంద్రబాబు టీడీపీ పెద్దలు ఎప్పుడో మాట్టాడేసుకున్నారని, ఇపుడు మాత్రం మాస్టర్‌ప్లాన్ అంటూ ప్రజలముందు నటిస్తున్నారు.. ఎందుకిదంతా.. అని ధర్మాన నిలదీశారు. కాగా తొక్కిసలాటకు కారణాలు వేరే ఉన్నాయంటూ మంత్రులతో కేబినెట్ భేటీలో చెప్పించడం రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని ధర్మాన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయిందన్నారు.
Next Story