సుప్రీం చెప్పినట్టు కాల్‌డేటా ఇవ్వాల్సిందే: సీఎంఎం కోర్టు
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 31వ తేదీ నాటికి కాల్‌డేటాను సీల్డ్‌కవర్‌లో ఇవ్వాల్సిందేనని విజయవాడ సీఎంఎం కోర్టు ఆదేశించింది. కాల్‌డేటా ఇచ్చేందుకు మరి కొంత సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు కోరారు. దీన్ని ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వరరావు వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సమయం ఎలా అడుగుతారని వాదించారు. దీంతో ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయవాది ఏకీభవించారు. ఈ నెల 31వ తేదీలోగా 24 నెంబర్ల సీడీఆర్‌ను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లకు కోర్టు […]
BY sarvi23 July 2015 6:47 PM IST
sarvi Updated On: 24 July 2015 11:43 AM IST
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 31వ తేదీ నాటికి కాల్‌డేటాను సీల్డ్‌కవర్‌లో ఇవ్వాల్సిందేనని విజయవాడ సీఎంఎం కోర్టు ఆదేశించింది. కాల్‌డేటా ఇచ్చేందుకు మరి కొంత సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు కోరారు. దీన్ని ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వరరావు వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సమయం ఎలా అడుగుతారని వాదించారు. దీంతో ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయవాది ఏకీభవించారు. ఈ నెల 31వ తేదీలోగా 24 నెంబర్ల సీడీఆర్‌ను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరువైపు న్యాయవాదుల వాద ప్రతివాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 31వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Next Story