Telugu Global
Others

రైల్వే పోలీసుల ఘాతుకం... అథ్లెట్ దుర్మరణం

జాతీయ అథ్లెట్, ఫెన్సింగ్ ఛాంపియన్(కత్తియుద్ధం) హోసియర్ సింగ్‌ను రైల్వే పోలీసులు కదులుతున్న రైలు నుంచి తోసేశారు. దీంతో అథ్లెట్ మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లో నిన్న చోటుచేసుకుంది. హోసియర్ మధుర నుంచి స్వస్థలమైన కాస్‌గంజ్‌కు తల్లి, భార్యతో కలిసి రైలులో తిరిగివెళ్తున్నాడు. తల్లి, భార్య మహిళా కోచ్‌లో కూర్చోగా హోసియర్ జనరల్ కోచ్‌లో కూర్చున్నాడు. కాసేపటి తర్వాత అనారోగ్యంతో ఉన్న భార్య ఫోన్ పిలుపుతో హోసియర్ మహిళా కోచ్‌లోకి వెళ్లాడు. మహిళా కోచ్‌లో ఉన్నందుకు రైల్వే […]

రైల్వే పోలీసుల ఘాతుకం... అథ్లెట్ దుర్మరణం
X
జాతీయ అథ్లెట్, ఫెన్సింగ్ ఛాంపియన్(కత్తియుద్ధం) హోసియర్ సింగ్‌ను రైల్వే పోలీసులు కదులుతున్న రైలు నుంచి తోసేశారు. దీంతో అథ్లెట్ మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లో నిన్న చోటుచేసుకుంది. హోసియర్ మధుర నుంచి స్వస్థలమైన కాస్‌గంజ్‌కు తల్లి, భార్యతో కలిసి రైలులో తిరిగివెళ్తున్నాడు. తల్లి, భార్య మహిళా కోచ్‌లో కూర్చోగా హోసియర్ జనరల్ కోచ్‌లో కూర్చున్నాడు. కాసేపటి తర్వాత అనారోగ్యంతో ఉన్న భార్య ఫోన్ పిలుపుతో హోసియర్ మహిళా కోచ్‌లోకి వెళ్లాడు. మహిళా కోచ్‌లో ఉన్నందుకు రైల్వే పోలీసులు అతడివద్ద నుంచి రూ. 200 డిమాండ్ చేశారు. వచ్చే స్టేషన్‌లో దిగివెళ్లిపోతానని చెప్పి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన పోలీసులు బూతులు తిడుతూ హోసియర్‌ను కదులుతున్న రైలు నుంచి తోసేశారు. ఈ ఘటనలో అతడు మృతిచెందాడు.
First Published:  23 July 2015 6:35 PM IST
Next Story