Telugu Global
Others

ఏపీలో 26%, తెలంగాణలో 33% బోగస్ ఓటర్లు 

ఆధార్‌తో అనుసంధానం ప్రారంభమైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో బోగస్ ఓటర్‌ కార్డులను అధికారులు గుర్తిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు గుర్తించిన ఓటర్‌కార్డుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 33.74 శాతం ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 25.54 శాతం ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల అధికారులు లెక్కలు తేల్చారు. తెలుగు రాష్ర్టాల్లో ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సిన ఓటర్లు భారీ సంఖ్యలోనే ఉన్నట్టుగా అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఓటర్లందరూ తమ ఓటరు కార్డును ఆధార్‌తో ఉచితంగా అనుసంధానించుకోవచ్చని, ఇందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని […]

ఆధార్‌తో అనుసంధానం ప్రారంభమైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో బోగస్ ఓటర్‌ కార్డులను అధికారులు గుర్తిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు గుర్తించిన ఓటర్‌కార్డుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 33.74 శాతం ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 25.54 శాతం ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల అధికారులు లెక్కలు తేల్చారు. తెలుగు రాష్ర్టాల్లో ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సిన ఓటర్లు భారీ సంఖ్యలోనే ఉన్నట్టుగా అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఓటర్లందరూ తమ ఓటరు కార్డును ఆధార్‌తో ఉచితంగా అనుసంధానించుకోవచ్చని, ఇందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని ఓటర్లు ఈ సేవ, మీ సేవ, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా.. తమ ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్)ను గురువారం నుంచి ఆధార్‌తో అనుసంధానించుకోవచ్చని తెలిపారు. ఇంట్లో నుంచే ఇంటర్‌నెట్‌ ద్వారా అనుసంధానించుకోవచ్చని ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ తెలిపారు.
First Published:  23 July 2015 6:39 PM IST
Next Story