మరో పదేళ్లలో వెన్నెలపై హాయ్ హాయ్
వెన్నెల్లో హాయ్ హాయ్..మల్లెల్లో హాయ్ అని పాడుకోవడం వరకే మనుషులు ఇంతవరకు పరిమితమయ్యారు. అయితే మరో పదేళ్లలో వెన్నెలపైనే హాయిగా ఆడుకోవచ్చంటోంది.. అమెరికా న్యూస్ అండ్ టెక్నాలజీ మీడియా నెట్‌వర్క్! నేరుగా చందమామతోనే ముచ్చట్లు చెప్పుకోవచ్చని చెబుతోంది. ఎందుకంటే చంద్రునిపై మకాం వేసేందుకు నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చాలా ఏళ్ల తర్వాత హ్యూమన్ మిషన్ టు ద మూన్ ప్రాజెక్టు మొదలుపెట్టింది నాసా! చంద్రునిపై మనిషి అడుగుపెట్టి 46 ఏళ్లయిన సందర్భంగా జులై 20న నాసా ఈ […]
వెన్నెల్లో హాయ్ హాయ్..మల్లెల్లో హాయ్ అని పాడుకోవడం వరకే మనుషులు ఇంతవరకు పరిమితమయ్యారు. అయితే మరో పదేళ్లలో వెన్నెలపైనే హాయిగా ఆడుకోవచ్చంటోంది.. అమెరికా న్యూస్ అండ్ టెక్నాలజీ మీడియా నెట్‌వర్క్! నేరుగా చందమామతోనే ముచ్చట్లు చెప్పుకోవచ్చని చెబుతోంది. ఎందుకంటే చంద్రునిపై మకాం వేసేందుకు నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చాలా ఏళ్ల తర్వాత హ్యూమన్ మిషన్ టు ద మూన్ ప్రాజెక్టు మొదలుపెట్టింది నాసా! చంద్రునిపై మనిషి అడుగుపెట్టి 46 ఏళ్లయిన సందర్భంగా జులై 20న నాసా ఈ విషయాన్ని ప్రకటించినట్టు అమెరికా న్యూస్ అండ్ టెక్నాలజీ మీడియా నెట్‌వర్క్ వెల్లడించింది.
రూట్ మ్యాప్ రెడీః
నాసా చంద్రయాన్‌కి రూట్‌మ్యాప్ కూడా సిద్ధమైంది. 2017నాటికి చంద్రునిపైకి రోబోని పంపాలని నాసా భావిస్తోంది. 2018కి రోవర్ల సాయంతో లునార్ ధ్రువ ప్రాంతాల్లో హైడ్రోజన్ ఉనికి కోసం అన్వేషణ సాగుతుంది. అలాగే 2021నాటికి చంద్రుని ఉపరితలంపై శాశ్వత స్థావరం కోసం రోబోటిక్ కన్‌స్ట్రక్షన్ పూర్తిచేయాలని ప్రణాళిక రూపొందించింది నాసా! భవిష్యత్తులో మనుషులు చంద్రునిపై అడుగుపెట్టడానికి అదెంతో అవసరమని భావిస్తోంది.
మూన్ టూర్‌కి మనీ ఎలా?
చంద్రయానం అంటే మాటలు కాదు. అదీ చంద్రునిపై మనవ విహారానికి రంగం సిద్ధం చేయాలంటే వేల బిలియన్ల డాలర్ల ఖర్చు చేయాలి. ఈ భారీ ప్రాజెక్టు కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా నిధులు సమకూర్చనుంది నాసా! స్పేస్ ఎక్స్, ఆర్బిటల్ ఎటికె, లేదా యునైటెడ్ లాంచ్ ఎలియన్స్ వంటి సంస్థల నుంచి సహాయం తీసుకోవాలని భావిస్తోంది. ఫాల్కన్9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి కిలోగ్రాము బరువైన సామాగ్రిని తరలించడానికి 4700 డాలర్లు ఖర్చవుతుంది. ఇక మూన్‌పై పర్మినెంట్ బేస్ నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అయితే కమిర్షియల్ పార్ట్‌నర్స్ సాయంతో నిధులు సమకూర్చుకునే పనిలో పడింది నాసా! ఈ ప్రాజెక్టు అధ్యయన బృందంలో నాసా అడ్మినిస్ర్టేషన్‌తో బాటు నలుగురు వ్యోమగాములు, కమిర్షియల్ స్పేస్‌క్రాఫ్ట్ కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు. మొత్తానికి ఇంతవరకు మున్‌మున్‌సేన్‌ని చూసి మురిసిపోయిన మనిషి త్వరలోనే మూన్‌పై ముసిముసినవ్వులు చిందించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నమాట!