Telugu Global
CRIME

చిన్నారిని చిదిమేసిన టీచర్‌ క్రమశిక్షణ!

పాఠశాల క్రమశిక్షణ ఓ చిన్నారిని చిదిమేసింది. ఇచ్చిన హొం వర్క్‌ చేయలేదన్న కారణంతో అశ్విత అనే పాపను టీచర్‌ గోడ కుర్జీ వేయించింది. రోజూ హోం వర్క్‌ చేయడం లేదన్న కోపం… ఒక్కసారి శిక్షిస్తే ఇక మాట విని హోం వర్క్‌ చేస్తుందన్న నిర్ణయంతో ఐదో తరగతి చదువుతున్న అశ్వితను టీచర్‌ గోడ కుర్చీ వేయమంది. ఈ పనిష్మెంట్‌ను తట్టుకోలేక పోయిన ఆ చిన్నారి స్పృహ తప్పి క్లాస్‌ రూంలోనే పడిపోయింది. వెంటనే లేపి నీళ్ళు చల్లినా […]

చిన్నారిని చిదిమేసిన టీచర్‌ క్రమశిక్షణ!
X
పాఠశాల క్రమశిక్షణ ఓ చిన్నారిని చిదిమేసింది. ఇచ్చిన హొం వర్క్‌ చేయలేదన్న కారణంతో అశ్విత అనే పాపను టీచర్‌ గోడ కుర్జీ వేయించింది. రోజూ హోం వర్క్‌ చేయడం లేదన్న కోపం… ఒక్కసారి శిక్షిస్తే ఇక మాట విని హోం వర్క్‌ చేస్తుందన్న నిర్ణయంతో ఐదో తరగతి చదువుతున్న అశ్వితను టీచర్‌ గోడ కుర్చీ వేయమంది. ఈ పనిష్మెంట్‌ను తట్టుకోలేక పోయిన ఆ చిన్నారి స్పృహ తప్పి క్లాస్‌ రూంలోనే పడిపోయింది. వెంటనే లేపి నీళ్ళు చల్లినా లేవలేదు. ఆస్పత్రికి తీసుకెళ్ళే ప్రయత్నంలోనే ఆ పాప ప్రాణాలొదిలేసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ఓ ప్రయివేటు స్కూల్లో చోటు చేసుకుంది. సంఘటనకు చలించిపోయిన చుట్టుపక్కల వారు, పాప తరఫు బంధువులు ఆ స్కూలు టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లలని కూడా చూడకుండా ఇలాంటి శిక్షలతో పాఠశాలల యాజమాన్యం ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. కేవలం ఆరోపణలతో ఇది ఆగలేదు. ఆగ్రహం చెందిన కొంతమంది స్కూల్లో ప్రవేశించి కంప్యూటర్‌ను, స్కూలు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో ఆగ్రహంలో ఉన్న బాధిత పాప తరఫు వారు తమపై ఎక్కడ భౌతిక దాడులకు పాల్పడతారో అన్న భయంతో పాఠశాల సంబంధికులంతా పారిపోయారు. లెక్కల హోం వర్క్‌ చేయలేదన్న కారణంతో అశ్వితతో స్కూల్లో టీచర్‌ గోడ కుర్చీ వేయించిందని, పాప బాధతో కింద పడిపోయి చనిపోయిందని తోటి విద్యార్థినీవిద్యార్థలు తెలిపారు.
First Published:  23 July 2015 12:33 AM GMT
Next Story