Telugu Global
Others

సుష్మాకు కలిసి వస్తున్న మిత్ర భేదం!

కాంగ్రెస్‌కు అన్నాడీఎంకే కలిసిరాదు… తృణమూల్‌ కాంగ్రెస్‌ సహకరించదు… వామపక్షాలు చేతులు కలిపి పని చేస్తామన్న వారికున్న బలం నామ మాత్రం. కనీసం బిజూ జనతాదళ్‌ను అయినా తనతో కలుపుకోగలిగిందా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్‌. ఇలాంటి పరిస్థితుల్లో విపక్ష కాంగ్రెస్‌ ఏ యుద్ధం చేయాలన్నా కర్ర విడిచి సాము చేయడమే. సరిగ్గా ఇదే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు కలిసొస్తోంది. లలిత్ మోడీకి సహకరించారనే ఆరోపణలపై సుష్మ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మిగిలిన […]

సుష్మాకు కలిసి వస్తున్న మిత్ర భేదం!
X
కాంగ్రెస్‌కు అన్నాడీఎంకే కలిసిరాదు… తృణమూల్‌ కాంగ్రెస్‌ సహకరించదు… వామపక్షాలు చేతులు కలిపి పని చేస్తామన్న వారికున్న బలం నామ మాత్రం. కనీసం బిజూ జనతాదళ్‌ను అయినా తనతో కలుపుకోగలిగిందా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్‌. ఇలాంటి పరిస్థితుల్లో విపక్ష కాంగ్రెస్‌ ఏ యుద్ధం చేయాలన్నా కర్ర విడిచి సాము చేయడమే. సరిగ్గా ఇదే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు కలిసొస్తోంది. లలిత్ మోడీకి సహకరించారనే ఆరోపణలపై సుష్మ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మిగిలిన విపక్షాలు మాత్రం అంతదాకా ఎందుకన్నట్టు వ్యవహరిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో తనకంటూ ప్రత్యేకంగా ఓ అభిప్రాయమున్నట్టు సుస్పష్టంగా చెబుతోంది. రాజీనామా దాకా ఎందుకు? సభలో చర్చకు అనువైన వాతావరణం ఉంటే చాలని తెలిపింది. చర్చించకుండానే సుష్మ రాజీనామా కోరడం సహేతుకం కాదన్నది తృణమూల్‌ భావనలా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిరాకరించింది. వామపక్షాలు కలిసివచ్చినా ఉభయ సభల్లో వారి బలం అంతంత మాత్రమే. 37 మంది ఎంపీలున్న అన్నాడిఎంకే కానీ, 34 మంది ఎంపీలున్న తృణమూల్ కానీ మద్దతివ్వకపోవడంతో కాంగ్రెస్‌ ఒంటరి పోరాటం చేస్తోంది. కనీసం 20 మంది ఎంపీలున్న బిజూ జనతాదళ్‌ను కూడా కాంగ్రెస్ తమతో కలుపుకుని ముందుకు వెళ్ళలేకపోతోంది. ప్రతిపక్షాల అనైక్యతతో కాంగ్రెస్ ఆందోళన ఒంటరిపోరే అయింది. రాజీనామా విషయంలో విపక్షాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం సుష్మాకు కలిసి వస్తోంది.
First Published:  23 July 2015 10:33 AM IST
Next Story