Telugu Global
National

కెమెరాలు మావైపు తిప్పండి: సోనియా

తాము చేస్తున్న నిరసనలు జనానికి తెలియకుండా మోడి ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ప్రతిపక్షాల నోరు నొక్కేయడం ప్రధాని మోడీ స్టయిల్‌ అని ఆమె అన్నారు. విపక్షాల ఆందోళనను ఉభయసభల ప్రత్యక్ష ప్రసారాల్లో కనపడనీయకుండా చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. లోక్‌సభలో తమ ఆందోళనలు కెమెరాలో కనపడనీయకుండా చేస్తున్నారని సోనియా చెప్పారు. మరోవైపు సోనియా వ్యాఖ్యలపై బిజెపి విరుచుకుపడింది. కెమెరాల్లో కనపడటం కోసం ఆందోళనలు తగవని హితవు చెప్పింది. ప్రతిపక్షాలు కనపడనీయకుండా […]

కెమెరాలు మావైపు తిప్పండి: సోనియా
X
తాము చేస్తున్న నిరసనలు జనానికి తెలియకుండా మోడి ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ప్రతిపక్షాల నోరు నొక్కేయడం ప్రధాని మోడీ స్టయిల్‌ అని ఆమె అన్నారు. విపక్షాల ఆందోళనను ఉభయసభల ప్రత్యక్ష ప్రసారాల్లో కనపడనీయకుండా చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. లోక్‌సభలో తమ ఆందోళనలు కెమెరాలో కనపడనీయకుండా చేస్తున్నారని సోనియా చెప్పారు. మరోవైపు సోనియా వ్యాఖ్యలపై బిజెపి విరుచుకుపడింది. కెమెరాల్లో కనపడటం కోసం ఆందోళనలు తగవని హితవు చెప్పింది. ప్రతిపక్షాలు కనపడనీయకుండా పార్లమెంట్ ఉభయసభల కెమెరాలను నియంత్రించింది కాంగ్రెస్ పార్టీయేనని ప్రతిదాడి చేసింది.
టీవీల్లో ఫోజులకే రాహుల్‌ ఆందోళన: జవదేకర్
ప్రధానిపై సూటిగా విమర్శలు చేస్తున్న రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రులు విరుచుకుపడ్డారు. రాహుల్‌తో సహా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నల్లబ్యాడ్జిలు ధరించడం, ఆందోళనలు చేయడం కేవలం టీవీల్లో కనపడటానికి మాత్రమేనని చెప్పారు. కెమెరాలకు కనపడటానికే ప్రతిపక్షాల ఆందోళనలు పరిమితమయ్యాయని కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. పదేళ్లుగా దేశాన్ని దోపిడి చేయడంపై రాహుల్ ముందుగా సమాధానం చెబితే ప్రధాని కూడా మౌనం వీడతారని చెప్పారు.
First Published:  23 July 2015 10:40 AM IST
Next Story