Telugu Global
Others

నిర్మలా సీతారామ‌న్ సలహా బాబు కూడా పాటించాలా ?

ఉత్త‌రాఖండ్ మ‌ద్యం షాపుల లైసెన్సుల కుంభ‌కోణంపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. సీఎం హ‌రీష్ రావ‌త్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. మద్యం షాపుల లైసెన్స్ ల‌ మంజూరుకు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉత్తరఖండ్ సీఎం హరీశ్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి మహ్మద్ షాహిద్ స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయారు. ఓ పత్రిక చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్ మద్యం పాలసీ కేటాయింపుల్లో అవకతకవలు జరిగినట్టు ఈ […]

నిర్మలా సీతారామ‌న్ సలహా బాబు కూడా పాటించాలా ?
X

ఉత్త‌రాఖండ్ మ‌ద్యం షాపుల లైసెన్సుల కుంభ‌కోణంపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. సీఎం హ‌రీష్ రావ‌త్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. మద్యం షాపుల లైసెన్స్ ల‌ మంజూరుకు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉత్తరఖండ్ సీఎం హరీశ్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి మహ్మద్ షాహిద్ స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయారు. ఓ పత్రిక చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్ మద్యం పాలసీ కేటాయింపుల్లో అవకతకవలు జరిగినట్టు ఈ స్టింగ్ ఆపరేషన్ వెల్లడించింది. మహ్మద్ షాహిద్ మూడు ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తారని, అలాంటి ఆయన కూర్చుని వాటాల గురించి చర్చించడం దారుణమని నిర్మ‌లా సీతారామ‌న్‌ మండిపడ్డారు. ఉత్తరాఖండ్ ఆదాయం అంతా పర్యాటక రంగం నుంచే వస్తుందని, కానీ దాన్ని వదిలిపెట్టి మద్యం గురించి, దాని మీద వచ్చే లంచాల గురించి మాట్లాడుకోవడం నీచమైన విషయమని ఆమె అన్నారు. ఇలాంటి దారుణాలు జరుగుతున్నందున సీఎం హరీష్ రావత్ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అంతా బాగానే ఉంది.. సీఎం వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి త‌ప్పు చేస్తేనే సీఎం రాజీనామా చేయాలంటున్నారు… మ‌రి ఇక్క‌డ ఓటుకు కోట్లు కేసులో స్వ‌యంగా చంద్ర‌బాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్‌కి 50 ల‌క్ష‌ల రూపాయ‌లిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప‌ట్టుబ‌డ్డాడు. మ‌రి నిర్మ‌లా సీతారామ‌న్ వీళ్ల‌ను ఎందుకు రాజీనామా చేయ‌మ‌న‌డం లేదు? చ‌ంద్ర‌బాబుకో న్యాయం? హ‌రీష్ రావ‌త్ కు ఓ న్యాయ‌మా?

First Published:  23 July 2015 5:37 AM IST
Next Story