తొక్కిసలాటపై ఆ విధంగా ముందుకుపోదాం...
అనుకున్నదే అయింది! సమస్యను తనపై రాకుండా తప్పించుకోవడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. ఈవిషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్లో తొక్కిసలాటకు కారణం చంద్రబాబే అని దేశమంతా వేలెత్తి చూపుతోంది. తప్పుకు కారణం చంద్రబాబు పుణ్యస్నానమేనని కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో చంద్రబాబుకు దిక్కుతోచలేదు. అందుకే ఆ ఆరోపణలకు చంద్రబాబు అండ్ టీం కొత్త భాష్యం చెబుతున్నారు. దుర్ఘటన జరగడానికి ముందు షార్ట్ సర్క్యూట్ అని పుకార్లురావడంతో ప్రాణభయంతో పరుగులు తీశారని, అదే తొక్కిసలాటకు దారి తీసిందని చంద్రబాబు మంత్రివర్గం […]
అనుకున్నదే అయింది! సమస్యను తనపై రాకుండా తప్పించుకోవడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి. ఈవిషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్లో తొక్కిసలాటకు కారణం చంద్రబాబే అని దేశమంతా వేలెత్తి చూపుతోంది. తప్పుకు కారణం చంద్రబాబు పుణ్యస్నానమేనని కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో చంద్రబాబుకు దిక్కుతోచలేదు. అందుకే ఆ ఆరోపణలకు చంద్రబాబు అండ్ టీం కొత్త భాష్యం చెబుతున్నారు. దుర్ఘటన జరగడానికి ముందు షార్ట్ సర్క్యూట్ అని పుకార్లురావడంతో ప్రాణభయంతో పరుగులు తీశారని, అదే తొక్కిసలాటకు దారి తీసిందని చంద్రబాబు మంత్రివర్గం తాజాగా తేల్చింది. పుష్కరస్నానాల తొలిరోజు చంద్రబాబు కుటుంబ సమేతంగా స్నానాలుచేశారు. దానితో సాధారణ జనాలను చాలాసేపు గేట్ల బయట ఆపారు. చంద్రబాబు స్నానం ముగియడంతో ఒక్కసారిగా జనాలను వదలడంతో అది తొక్కిసలాటకు దారితీసింది. ఘటనకు కారణం చంద్రబాబేనని జాతీయస్థాయిలో విమర్శలు రేగాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తొలుత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ, కలెక్టరు నివేదికతో నాలిక కరుచుకుని పరకాలపై వేటేద్దామని చూశారు. కేంద్రంలో ఆయన సతీమణి కీలక పదవిలో ఉండటంతో మిత్రపక్షంతో పెట్టుకోవడం ఎందుకని వెనకడుగు వేశారు. జాతీయ మీడియా చంద్రబాబు తీరును ఉతికి ఆరేసింది. ప్రజల ప్రాణాలు పోవడానికి చంద్రబాబే కారణమని తేల్చింది. దీంతో బాబు అంతర్మథనంలో పడ్డాడు. తనపై నిందవేసుకోలేడు. అధికారులపై వేసుకునే అవకాశం లేదు. మంత్రులకు పుష్కర ఏర్పాట్లు చూసుకునే బాధ్యత తానే అప్పజెప్పలేదు. దీంతో దిక్కుతోచక చచ్చిన వారిపై నెపం నెట్టాలని నిర్ణయించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? చచ్చిన వారు వచ్చి సాక్ష్యం చెప్పలేరు కదా? చంద్రబాబా మజాకా?