సోనియా అల్లుడుకు ఉచ్చు బిగిస్తున్న బీజేపీ
వ్యాపం, లలిత్ మోడీ వ్యవహారాలతో పూర్తిగా చిక్కుల్లో పడ్డ బీజేపీ ఆత్మరక్షణ కోసం కాంగ్రెస్‌పై ఎదురుదాడిని ప్రారంభించింది. అందుకోసం ప్రతిపక్ష నాయకురాలు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వద్రా భూక్రయవిక్రయాలపై ఉచ్చు బిగించింది. రాబర్ట్ వద్రాకు రాజస్థాన్‌లో భూములు అమ్మిన జైప్రకాష్ బంగ్వాడాను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అరెస్ట్ చేసింది. జై ప్రకాష్ ఇచ్చే స్టేట్‌మెంట్ ద్వారా వద్రా భూ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలను తమ ఆయుధంగా మార్చుకోవాలని వసుంధర ప్రభుత్వం భావిస్తోంది. రాబర్ట్ […]
BY sarvi22 July 2015 6:35 PM IST
sarvi Updated On: 23 July 2015 7:47 AM IST
వ్యాపం, లలిత్ మోడీ వ్యవహారాలతో పూర్తిగా చిక్కుల్లో పడ్డ బీజేపీ ఆత్మరక్షణ కోసం కాంగ్రెస్‌పై ఎదురుదాడిని ప్రారంభించింది. అందుకోసం ప్రతిపక్ష నాయకురాలు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వద్రా భూక్రయవిక్రయాలపై ఉచ్చు బిగించింది. రాబర్ట్ వద్రాకు రాజస్థాన్‌లో భూములు అమ్మిన జైప్రకాష్ బంగ్వాడాను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అరెస్ట్ చేసింది. జై ప్రకాష్ ఇచ్చే స్టేట్‌మెంట్ ద్వారా వద్రా భూ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలను తమ ఆయుధంగా మార్చుకోవాలని వసుంధర ప్రభుత్వం భావిస్తోంది. రాబర్ట్ వద్రా 2010లో జైప్రకాష్ అనే వ్యక్తి వద్ద బికనీర్‌లోని 360 హెక్టార్ల భూమిని స్కైలైట్ ఆస్పత్రి కోసం కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగాయని, నకిలీ పత్రాలతో కొనుగోలు చేశారని ఫిర్యాదులు రావడంతో బీజేపీ ప్రభుత్వం ఆ భూమిని సీజ్ చేసింది. వాద్రా భూవివాదాన్ని మొదటిసారి ఐపీఎస్ అధికారి ఖేమ్కా వెలుగులోకి తెచ్చారు. వాద్రా, డీఎల్ఎఫ్ కంపెనీలు హర్యానాలో తక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేసి అధిక లాభాలకు అమ్ముకున్నారని ఐపీఎస్ అధికారి బయట పెట్టారు.
Next Story