విశాఖలో స్వాతంత్ర్య వేడుకలు !
ఈ సారి దేశ స్వాతంత్ర్య వేడుకలను విశాఖ పట్నంలో నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటపై నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో చంద్రబాబు కూడా అదే విధంగా ఆలోచించారు. ఏపీలో స్వాతంత్ర్య వేడుకలను కర్నూలు కొండారెడ్డి కోట మీద జరపాలని నిర్ణయించారు. దీంతో చారిత్రక కోటకు చక్కటి గుర్తింపు వచ్చిందని అంతా సంబరపడ్డారు. ఏపీ సర్కారు ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని కర్నూలుతోపాటు రాయలసీమ వాసులు ఆశపడ్డారు. తమ ప్రాంతానికి […]
BY sarvi23 July 2015 12:38 AM GMT
X
sarvi Updated On: 23 July 2015 12:38 AM GMT
ఈ సారి దేశ స్వాతంత్ర్య వేడుకలను విశాఖ పట్నంలో నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటపై నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో చంద్రబాబు కూడా అదే విధంగా ఆలోచించారు. ఏపీలో స్వాతంత్ర్య వేడుకలను కర్నూలు కొండారెడ్డి కోట మీద జరపాలని నిర్ణయించారు. దీంతో చారిత్రక కోటకు చక్కటి గుర్తింపు వచ్చిందని అంతా సంబరపడ్డారు. ఏపీ సర్కారు ఏటా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని కర్నూలుతోపాటు రాయలసీమ వాసులు ఆశపడ్డారు. తమ ప్రాంతానికి రాజధాని దక్కకున్నా.. కనీసం ఇలాగైనా చారిత్రక గుర్తింపు దక్కిందని సంతృప్తి చెందారు. కానీ, సర్కారు తాజా నిర్ణయంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ సారి వేడుకలను విశాఖలో నిర్వహించాలన్న టీడీపీ తాజా నిర్ణయంతో కర్నూలువాసులంతా నీరుగారిపోతున్నారు.
Next Story