లడ్డూబాబుకు పొట్ట వస్తోందట!
నాకీ మధ్య పొట్ట వస్తోంది! ఇలా తెలిసిన వారి దగ్గర అల్లరి నరేశ్ వాపోతున్నాడట. ఇంతకీ ఎందుకంటారా? ఇటీవల పెళ్లిచేసుకున్న అల్లరి నరేశ్‌కు బంధువుల నుంచి వరుస ఆహ్వానాలు వస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ విందు భోజనాలే! ఇంకేముంది డైట్ తప్పింది. దాంతో కొద్దిగా పొట్ట వచ్చిందట. అమ్మో! వెంటనే డైటింగ్ ఎక్సర్‌సైజులు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడట ఈ లడ్డూ బాబు. ఈ సుడిగాడు నటించిన జేమ్స్‌బాండ్ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఇది అల్లరి నరేశ్ […]
BY admin23 July 2015 2:30 AM IST
X
admin Updated On: 23 July 2015 7:07 AM IST
నాకీ మధ్య పొట్ట వస్తోంది! ఇలా తెలిసిన వారి దగ్గర అల్లరి నరేశ్ వాపోతున్నాడట. ఇంతకీ ఎందుకంటారా? ఇటీవల పెళ్లిచేసుకున్న అల్లరి నరేశ్‌కు బంధువుల నుంచి వరుస ఆహ్వానాలు వస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ విందు భోజనాలే! ఇంకేముంది డైట్ తప్పింది. దాంతో కొద్దిగా పొట్ట వచ్చిందట. అమ్మో! వెంటనే డైటింగ్ ఎక్సర్‌సైజులు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడట ఈ లడ్డూ బాబు. ఈ సుడిగాడు నటించిన జేమ్స్‌బాండ్ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఇది అల్లరి నరేశ్ 49వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ బెండు అప్పారావు గారు మోహన్‌బాబుతో ఓ ఫ్యామిలీ డ్రామా సినిమాలో నటిస్తున్నారు.
Next Story