పుష్కరాల తర్వాతే డీఎస్ భవితవ్యం
తాజాగా టీఆర్ఎస్‌లో చేరిన మాజీ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ భవిష్యత్ తేలేది గోదావరి పుష్కరాల తర్వాతే. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన డీఎస్ ఆహ్వానంపై లంచ్ కోసం ఆయన ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా వీరిరువురూ అరగంటపాటు భేటీ అయ్యారు. అయితే, వీరిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం మాత్రం బైటకు పొక్కలేదు. తనకు రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి ఉందని, జాతీయ రాజకీయాల పైన తనకు ఆసక్తి లేదని డీఎస్ ముఖ్యమంత్రికి చెప్పినట్లు […]
BY sarvi22 July 2015 6:37 PM IST
sarvi Updated On: 23 July 2015 7:59 AM IST
తాజాగా టీఆర్ఎస్‌లో చేరిన మాజీ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ భవిష్యత్ తేలేది గోదావరి పుష్కరాల తర్వాతే. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన డీఎస్ ఆహ్వానంపై లంచ్ కోసం ఆయన ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా వీరిరువురూ అరగంటపాటు భేటీ అయ్యారు. అయితే, వీరిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం మాత్రం బైటకు పొక్కలేదు. తనకు రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి ఉందని, జాతీయ రాజకీయాల పైన తనకు ఆసక్తి లేదని డీఎస్ ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి డీఎస్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేక శాసన మండలి నేతగా అవకాశం కల్పిస్తారా లేక ఏదైనా నామినేటెడ్ పదవితో సరిపెడతారా అన్నది వేచి చూడాల్సిందే. అయితే మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తూ సొంత పార్టీ వారిని విస్మరించడం పట్ల టీఆర్‌ఎస్‌లో అసంతృప్తివాదులు పెరుగుతున్నారు. పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పని చేసిన తమను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని వారంటున్నారు.
Next Story