Telugu Global
Cinema & Entertainment

బన్నీ సినిమాలో మరో హీరో

అల్లు అర్జున్ లాంటి హీరో సినిమాలో ఉంటే అందులో మరో హీరోకు చోటుండదు. అలాంటి కథల్ని బన్నీ అస్సలు ఒప్పుకోడు. కానీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నసినిమాలో మాత్రం బన్నీ మూవీలో మరో హీరో కనిపించబోతున్నాడు. అతడే ఆది. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి బన్నీ సినిమాలో కనిపించనున్నాడు. కాకపోతే హీరోగా కాదు… విలన్ గా. అవును.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోతున్న కొత్త సినిమాలో ఆదిని విలన్ గా […]

బన్నీ సినిమాలో మరో హీరో
X
అల్లు అర్జున్ లాంటి హీరో సినిమాలో ఉంటే అందులో మరో హీరోకు చోటుండదు. అలాంటి కథల్ని బన్నీ అస్సలు ఒప్పుకోడు. కానీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నసినిమాలో మాత్రం బన్నీ మూవీలో మరో హీరో కనిపించబోతున్నాడు. అతడే ఆది. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి బన్నీ సినిమాలో కనిపించనున్నాడు. కాకపోతే హీరోగా కాదు… విలన్ గా. అవును.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోతున్న కొత్త సినిమాలో ఆదిని విలన్ గా ఎంపిక చేశారు. తమిళనాట హీరోగా చలామణి అవుతున్న ఆది, కథ నచ్చి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించేందుకు ఒప్పుకున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ నెలాఖరు నుంచే బన్నీ-బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ తండ్రి అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. సినిమాకు ప్రస్తుతానికి రథం అనే టైటిల్ అనుకుంటున్నారు.
First Published:  23 July 2015 2:30 AM IST
Next Story