Telugu Global
Others

చీపురుతో జంగ్ ముదిరింది

మ‌రో నియామ‌కం హ‌స్తిన రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేపిట‌ల్‌లో త‌మ‌కు కేరాఫ్ అడ్ర‌స్ లేకుండా ఊడ్చేసిన చీపురు పార్టీని ప్ర‌జ‌లు చీద‌రించుకోవాల‌ని కేంద్రం మైండ్‌గేమ్ ప్రారంభించింది. ఆప్‌తో పోరుకు నేరుగా త‌ల‌ప‌డ‌కుండా జంగ్‌ను కింగ్‌పిన్‌గా ఉప‌యోగిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఆప్‌, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్  మ‌ధ్య వార్ కు మ‌హిళా క‌మిష‌న‌ర్ నియామ‌కం ఆజ్యం పోసింది. ఢిల్లీ మహిళా కమిషనర్‌గా స్వాతి మలివాల్‌ను నియ‌మిస్తూ సీఎం కేజ్రీవాల్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నియామ‌కం చెల్ల‌ద‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ […]

చీపురుతో జంగ్ ముదిరింది
X
మ‌రో నియామ‌కం హ‌స్తిన రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేపిట‌ల్‌లో త‌మ‌కు కేరాఫ్ అడ్ర‌స్ లేకుండా ఊడ్చేసిన చీపురు పార్టీని ప్ర‌జ‌లు చీద‌రించుకోవాల‌ని కేంద్రం మైండ్‌గేమ్ ప్రారంభించింది. ఆప్‌తో పోరుకు నేరుగా త‌ల‌ప‌డ‌కుండా జంగ్‌ను కింగ్‌పిన్‌గా ఉప‌యోగిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఆప్‌, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య వార్ కు మ‌హిళా క‌మిష‌న‌ర్ నియామ‌కం ఆజ్యం పోసింది. ఢిల్లీ మహిళా కమిషనర్‌గా స్వాతి మలివాల్‌ను నియ‌మిస్తూ సీఎం కేజ్రీవాల్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నియామ‌కం చెల్ల‌ద‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో గ‌త కొద్దిరోజులుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మ‌ధ్య సాగుతున్న జంగ్ ప‌తాక‌స్థాయికి చేరింది. వీటిని ప‌రిష్క‌రించి పెద్ద‌న్న పాత్ర పోషించాల్సిన కేంద్రం వేడుక చూస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఆప్ స‌ర్కార్‌తో ఢీ అంటే ఢీ అంటున్న‌ది లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ న‌జీబ్ జంగ్ అయినా… జంగ్ వెనుక ఉన్న‌ది మాత్రం కేంద్ర ప్ర‌భుత్వ‌మేన‌ని ఆప్‌తోపాటు విప‌క్షాలూ ఆరోపిస్తున్నాయి. సీఎం, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య నియామ‌కాలు, అధికారాల కోసం జంగ్ సాగుతున్నా.. అస‌లు కార‌ణం మాత్రం ఢిల్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ చ‌విచూసిన‌ ప‌రాభ‌వ‌మేన‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. గ‌తేడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ దారుణ ప‌రాభ‌వాన్ని ఎదుర్కొంది. 60 స్థానాల్లో 57 ఆప్ గెలుచుకోగా, మూడు స్థానాల్లో మాత్ర‌మే బీజేపీ విజ‌యం సాధించింది. బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్‌, ఆప్ మాజీ నాయ‌కురాలు కిర‌ణ్‌బేడీ కూడా ఓట‌మి పాలైంది. ఇదే ఆప్‌, బీజేపీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్‌కు కార‌ణ‌మైంద‌నే ప్ర‌చారం ఉంది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ న‌జీబ్‌జంగ్‌ను అడ్డుపెట్టుకుని ఆప్‌ స‌ర్కారును అస్థిర‌ప‌ర‌చాల‌ని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం, జంగ్‌ను దెబ్బ తీయ‌డం ద్వారా కేంద్రానికి త‌న స‌త్తా చూపాల‌ని సీఎం కేజ్రీవాల్ ఆట మొద‌లెట్టారు.
First Published:  23 July 2015 11:30 AM IST
Next Story